Telangana: అందరూ గుడిలోకి వెళ్తే.. వీళ్లు గుడియనక్కి వెళ్లారు.. సీన్ కట్ చేస్తే.!

|

Mar 22, 2024 | 12:33 PM

ఇదెక్కడి చోద్యంరా బాబూ.. ప్రతీ ఒక్కరు దేవుడి దర్శనానికి గుడిలోకి వెళ్తే.. వీరు మాత్రం గుడి వెనక్కి వెళ్లారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 10 మంది గుడి వెనక్కి వెళ్లారు.. ఇంతకీ ఎందుకు అని ఆలోచిస్తున్నారా.. ఈ ఘటన మన తెలంగాణలోని ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. మరి ఆ స్టోరీ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

ములుగు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. స్థానిక మంగపేట మండలం మల్లూరు గ్రామాంలో ఉన్న హేమాచల లక్ష్మీనరసింహస్వామి గుట్టపై పది మంది వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి గుప్త నిధుల తవ్వకాలు జరిపారు. గుట్ట పరిసరాల్లో పూజలు నిర్వహించి.. తవ్వకాలు చేశారు. అయితే స్థానికుల సరైన సమయానికి పోలీసులకు సమాచారం అందివ్వడంతో.. వారు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని ముఠాలోని కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక గుప్తనిధుల ముఠాలో అటవీ శాఖ సిబ్బంది కూడా ఉండటం గమనార్హం. అభివృద్ధి పనులు చేస్తున్న ఓ ఫారెస్ట్ అధికారితో పాటు అతడి సహాయకునిగా పనిచేస్తున్న వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Follow us on