మహిళ అస్థిపంజరాన్ని తవ్వి తీసి.. సెల్ఫీ తీసుకున్న వ్యక్తి.. ట్విస్ట్‌ ఏంటంటే..

Updated on: May 24, 2025 | 3:11 PM

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం మేదినీపూర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన జరిగింది . ఏడు సంవత్సరాల క్రితం ఓ స్థానిక మహిళను ఖననం చేశారు. తాజాగా అదే స్త్రీ అస్థిపంజరాన్ని ఓ యువకుడు సమాధి నుంచి తవ్వి బయటకు తీశాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. అనంతరం అతను అస్థిపంజరం పక్కన నిలబడి సెల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టాడు.

ఇది చూసిన గ్రామస్థుల కోపం నషాళానికి అంటింది. ఆ యువకుడిని ప్రభాకర్ సీతగా గుర్తించారు. అతన్ని పట్టుకుని చితకబాదారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం మేదినీపూర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఏడు సంవత్సరాల క్రితం ఓ స్థానిక మహిళను ఖననం చేశారు. తాజాగా అదే స్త్రీ అస్థిపంజరాన్ని ఓ యువకుడు సమాధి నుంచి తవ్వి బయటకు తీశాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. అనంతరం అతను అస్థిపంజరం పక్కన నిలబడి సెల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇది చూసిన గ్రామస్థుల కోపం నషాళానికి అంటింది. ఆ యువకుడిని ప్రభాకర్ సీతగా గుర్తించారు. అతన్ని పట్టుకుని చితకబాదారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ యువకుడు మద్యం మత్తులో ఉన్నాడు. అతని వద్ద ఓ మద్యం బాటిల్ కూడా దొరికింది. ప్రాథమిక దర్యాప్తులో ఆ యువకుడు గతంలో వేరే రాష్ట్రంలోని హోటల్‌లో పనిచేసేవాడని, మద్యానికి బానిసైన కారణంగా అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారని తేలింది. అతను ఆ మహిళ అస్థిపంజరాన్ని ఎందుకు తవ్వి తీశాడో స్పష్టత రాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐదు రోజుల్లో ఎవరెస్ట్‌ ఎక్కేసారు! యమా స్పీడ్‌గా ఎలా అంటే ..

ఓరీ దేవుడో..! ఇంటి పైకప్పుతో పాటు ఎగిరిపోయిన చిన్నారులు

హీరోయిన్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌పై రిపోర్టర్ వెకిలి ప్రశ్న.. ఇచ్చిపడేసిన స్టార్

తెలుగులో ఛాన్సులు రావడంలేదుంటూ.. స్టేజ్‌పై ఏడ్చిన హీరోయిన్

మా హీరో,హీరోయిన్లకు సపరేట్‌ రూం ఇచ్చి డ్రగ్స్ ఇస్తున్నాం.. లేడీ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్