ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. పెద్దలకు తమ ప్రేమ విషయాన్ని చెప్పారు. కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాలు అభ్యంతరం చెప్పాయి. ప్రేమికుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఎవరికివారే అన్నట్టు విడిపోయారు. కానీ ఒకరినొకరు మర్చిపోలేకపోయారు. యువకుడు యువతిని వేధిస్తున్నాడంటూ పెద్దల్లో పంచాయితీ పెట్టారు. చివరికి యువకుడు ప్రేమను విరమించుకొని మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తట్టుకోలేకపోయింది. తను ప్రేమించిన వ్యక్తిని వదులుకోలేకపోయింది. తనకు న్యాయం చేయమంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన చేపట్టింది. ఈ ఘటన వనపర్తిజిల్లాలో జరిగింది.తిరుమాలయపల్లికి చెందిన కృష్ణవేణి అనే యువతి, రామన్ పాడుకు చెందిన రాములు ప్రేమించుకున్నారు. పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరూ విడిపోయారు. రాములు వేరే అమ్మాయిని వివాహం చేసుకోవడంతో.. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని, అతనితోనే పెళ్లి జరిపించాలంటూ మండుటెండలో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపింది కృష్ణవేణి. మదనాపురం మండలం ఎర్రగట్టు సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి ఐదు గంటల పాటు ముప్పు తిప్పలు పెట్టింది. రెవెన్యూ, పోలీస్ అధికారులు అక్కడకు చేసుకొని కిందకు రావాలని విజ్ఞప్తి చేసిన ఆమె వినిపించుకోలేదు. తనకు న్యాయం జరిగే వరకూ కిందికి రానని చెప్పడంతో చివరకు సెల్ టవర్ నిర్వాహకులు, స్థానికులు టవర్ ఎక్కి పైకి వెళ్లి అమ్మాయిని సముదాయించి తాళ్ల సహాయంతో కిందకు దించారు. అప్పటికే ఎండ వేడిమికి యువతి అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయింది. వెంటనే చికిత్స కోసం మదనాపురం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వీడియోస్ కోసం: Videos Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్.. Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో.. Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..