కరీంనగర్ కుర్రోడా మజాకా ?? ఏం ట్యాలెంట్ రా బాబు !!

|

Jan 25, 2023 | 9:30 AM

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన కాసం అఖిల్ రెడ్డి ఏదో ఒక నూతన ఆవిష్కరణ చేయాలని చిన్ననాటి కలలు కనేవాడు.

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన కాసం అఖిల్ రెడ్డి ఏదో ఒక నూతన ఆవిష్కరణ చేయాలని చిన్ననాటి కలలు కనేవాడు. తల్లిదండ్రులు కూడా ఆ యువకుడి కలలు సాకారం చేసుకునేలా ప్రోత్సహించారు. పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుంచి ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందాడు. ఆ సమయంలో తన తండ్రి దూరంగా ఉన్న పొలానికి వెళ్లడానికి సైకిల్ తొక్కలేక పడుతున్న ఇబ్బంది.. ప్రజలు ఎదుర్కొంటున్న ఇంధనధరల సమస్యలు చూసి.. బ్యాటరీ వాహనం తయారు చేయాలని ప్రణాళిక చేసుకున్నాడు. ఈ క్రమంలో తన ఇంట్లోనే మూలనపడి ఉన్న హీరో హోండా స్ప్లెండర్ బైక్ ను తన ఆవిష్కరణకు మూల వస్తువుగా మార్చుకున్నాడు. దానికి 4.8 కిలోవాట్ల మోటరు, కంట్రోలర్, ఓ కన్వర్టర్ తో పాటు స్పీడో మీటర్‌ను బిగించి ఎలక్ట్రిక్ బైక్ గా మార్చేశాడు. గరిష్ట వేగం 70 కిలోమీటర్లతో ఈ బైక్ దూసుకెళ్లేలా తయారు చేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కదులుతున్న రైలుపై ఆ యువకుడు ఏం చేసాడో చూస్తే !! ప్రాణం విలువ తెలియదంటూ నెటిజన్లు ఫైర్‌

Follow us on