Poison Food: హాస్టల్ భోజనంలో పురుగులు, బొద్దింకలు ప్రత్యక్షం.! వీడియో వైరల్.
తెలంగాణ వ్యాప్తంగా హాస్టళ్లలో విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొన్నటికి మొన్న హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ హాస్టల్ విద్యార్ధుల భోజనంలో ఎలుకలు, పురుగులు ప్రత్యక్షమయ్యాయి. తాజాగా నిజామాబాద్‌లో టీజీ వర్సిటీ విద్యార్ధులకు అలాంటి అనుభవమే ఎదురైంది. విద్యార్థులకు వడ్డించిన భోజనంలో బొద్దింకలు, పురుగులు కనిపించాయి. దీంతో ఆ భోజనం చేసేందుకు విద్యార్థులు భయపడ్డారు.
తెలంగాణ వ్యాప్తంగా హాస్టళ్లలో విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొన్నటికి మొన్న హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ హాస్టల్ విద్యార్ధుల భోజనంలో ఎలుకలు, పురుగులు ప్రత్యక్షమయ్యాయి. తాజాగా నిజామాబాద్‌లో టీజీ వర్సిటీ విద్యార్ధులకు అలాంటి అనుభవమే ఎదురైంది. విద్యార్థులకు వడ్డించిన భోజనంలో బొద్దింకలు, పురుగులు కనిపించాయి. దీంతో ఆ భోజనం చేసేందుకు విద్యార్థులు భయపడ్డారు. ఈ హాస్టల్‌లో 15 రోజుల్లో వరసగా రెండోసారి ఇలా ఆహారంలో పురుగులు కనిపించడంతో విద్యార్ధులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అంతేకాదు ఇటీవలే ఉదయం విద్యార్ధులకు పెట్టే అల్పాహారంలో బల్లి కనిపించింది. ఎన్నిసార్లు విద్యార్ధులు మొరపెట్టుకున్నా హాస్టల్ సిబ్బంది పనితీరులో మార్పు రాకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు.
లక్షలు ఖర్చుపెట్టి తమ పిల్లలు బాగా చదువుకోవాలని హాస్టల్స్‌లో ఉంచి చదివిస్తున్నారు తల్లిదండ్రులు. అయితే హాస్టల్స్ నిర్వాహకులు విద్యార్ధుల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. శుభ్రతలేని, కలుషిత ఆహారం విద్యార్ధులకు వడ్డిస్తున్నారని, దీంతో విద్యార్ధులు తరచూ అస్వస్థతకు గురవుతున్నారని ఆరోపించారు. ప్రతిరోజూ ఇలాంటి ఘటనలు ఎక్కడో అక్కడ చోటుచేసుకుంటూనే ఉన్నాయి. విద్యార్ధులు ఫుడ్ పాయిజన్‌కు గురై అనారోగ్యం పాలవుతున్నారు. దీనిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.