Golden Dress: మెరిసిపోతున్న గోల్డెన్‌ డ్రెస్‌ చూసారా

Updated on: Oct 24, 2025 | 4:53 PM

దుబాయ్‌ లో తక్కువ టాక్స్, ఇంపోర్ట్ డ్యూటీస్ వల్ల బంగారం ధర తక్కువే. సిటీ ఆఫ్ గోల్డ్‌గా దుబాయ్‌కి పేరుంది. తాజాగా దుబాయ్‌కు చెందిన అల్‌ రొమోజాన్‌ బ్రాండ్‌... పది కిలోల బంగారంతో తొమ్మిదిన్నర కోట్ల ఖరీదైన ‘గోల్డ్‌ డ్రెస్‌’ను రూపొందించింది. విలాసాలకూ, సంపదకూ పేరున్న దుబాయ్‌ తాజాగా 21 క్యారెట్ల మేలిమి బంగారంతో తొమ్మిదిన్నర కోట్ల రూపాయల విలువైన బంగారం డ్రస్‌ను రూపొందించి, గిన్నిస్‌ రికార్డు నెలకొల్పింది.

పది కిలోల బరువున్న ఈ డ్రస్‌ ప్రపంచంలోనే అత్యంత బరువైన, విలువైన డ్రస్‌గా పేరు తెచ్చుకుంది. ఒక బంగారు కిరీటం, నెక్లెస్‌, నడుముకు తగిలించుకునే హియార్‌ అనే ఆభరణం ఈ డ్రెస్‌లో అమర్చారు. వజ్రాలు, కెంపులు, పచ్చలు, రత్నాలను పొదిగారు. అరబ్బుల చరిత్ర, వారసత్వానికి అద్దం పడుతూ చక్కని పనితనంతో ఈ డ్రస్‌ను కళాత్మకంగా రూపొందించారు. డ్రెస్‌కు తగ్గట్టుగా రూపొందించిన బంగారు కిరీటం టియారా 398 గ్రాముల బరువుంటే, నెక్లెస్‌ ఏకంగా 8,810 గ్రాముల బరువుంది. ఇయర్‌ రింగ్స్‌ 134 గ్రాముల బరువున్నాయి. బంగారం డ్రస్‌ రూపకల్పనతో దుబాయ్‌.. బంగారు ఆభరణ ప్రియుల వన్‌ స్టాప్ డెస్టినేషన్‌గా ప్రత్యేక గుర్తింపును పొందింది. అయితే, ఈ వస్త్రాన్ని అమ్మకానికి ఉంచడం లేదని తయారీదారులు చెప్పారు. భవిష్యత్తులో యూరప్, ఆసియాలోని పలు ముఖ్య నగరాల్లో జరిగే ఫ్యాషన్, జ్యువెలరీ ప్రదర్శనల్లో దీనిని ప్రదర్శించనున్నారట. షార్జాలో జరిగిన మిడిల్‌ ఈస్ట్‌ జ్యువెలరీ ప్రదర్శనలో పలు ఆభరణాల కంపెనీలు తమ ఉత్పత్తు లను ప్రదర్శించాయి. వీటిలో దుబాయ్‌ గోల్డెన్‌ డ్రస్‌తో పాటు మూడున్నర కోట్ల రూపాయల విలువైన గోల్డ్‌ ప్లేటెడ్‌ సైకిల్‌ కూడా ఉంది!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Srikakulam: ఎస్పీ చూస్తుండగానే.. MLA పైకి రివాల్వర్ ఎక్కుపెట్టిన మంత్రి

నెల రోజులు.. 28 లక్షల కోట్లు అదీ మన యూపీఐ కెపాసిటీ బాస్

రాష్ట్రపతి హెలికాప్టర్‌ను నెట్టిన సిబ్బంది

TOP 9 ET News: ప్రభాస్ రూ.3500 కోట్లు..ఫిల్మ్ ఫెటర్నిటీలో ఒకే ఒక్కడు

Renu Desai: మీకు దండం పెడతాను.. ఇలాంటి వార్తలు వద్దు