
Indian Athlete Shelly Singh: ప్రపంచ అండర్ -20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం తరపున లాంగ్ జంప్ ఈవెంట్లో 17 ఏళ్ల షెల్లీ సింగ్ రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఆనందంలో ఆమె డ్యాన్స్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆమె చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతూ.. కామెంట్లు కూడా చేస్తున్నారు.
భారత్‌కు వచ్చిన తర్వాత డ్యాన్స్ చేసిన షెల్లీ..
షెల్లీ తన ఉత్తమ ప్రయత్నంగా 6.59 మీటర్ల దూకి, రజతం సాధించింది. అనంతరం భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, షెల్లీ సింగ్ డ్యాన్స్ రూపంలో ప్రపంచ అండర్ -20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించినందుకు తన సంతోషం వ్యక్తం చేసింది. ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో బాగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో వైరల్‌గా మారింది.
1 సెంటీమీటర్తో బంగారం కోల్పోయిన షెల్లీ…
కేవలం 1 సెంటీమీటర్ దూరంతో స్వర్ణాన్ని గెలుచుకునే అవకాశాన్ని షెల్లీ కోల్పోయింది. 1 సెంటీమీటర్తో స్వర్ణ పతకాన్ని కోల్పోవడం బాధగా ఉందని, అయితే మొదటి అంతర్జాతీయ ఈవెంట్లో రజతం సాధించినందుకు సంతోషంగా ఉందని షెల్లీ అన్నారు. నేను తదుపరి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తప్పకుండా బంగారు పతకం సాధించడానికి ప్రయత్నిస్తానని పేర్కొంది.
సరికొత్త జాతీయ రికార్డు..
షెల్లీ సింగ్ 6.59 మీటర్ల జంప్‌తో రెండవ స్థానంలో నిలిచింది. దీంతో సరికొత్త జాతీయ రికార్డును నెలకొల్పారు. స్వీడన్‌కు చెందిన 18 ఏళ్ల మజా 6.60 మీటర్లు దూకి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన మూడవ భారతీయ అథ్లెట్‌గా షెల్లీ నిలిచింది.
Also Read: Dear Megha: “డియర్ మేఘ” ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో
Afghanistan Crisis: తాలిబన్ల అరాచకం.. కాబుల్ ఎయిర్ పోర్ట్ లో ప్లేట్ మీల్స్ రూ. 7 వేలు.. వీడియో
Aliens: ఏలియన్స్‌పై క్లారిటీ.. ఆ గ్రహంలోనే ఏలియన్స్ ఉన్నాయ్..?? వీడియో