Electrical Flight Video: గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్‌ విమానం వచ్చేసింది..! ఇక శిలాజ ఇంధనాల అవసరం లేదు..

|

Oct 07, 2022 | 5:58 PM

ప్రపంచంలోనే తొలిసారిగా విద్యుత్తుతో నడిచే విమానం గాలిలో చక్కర్లు కొట్టింది. ఈవియేషన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సంస్థ తయారుచేసిన ఈ విమానం వాషింగ్టన్‌లోని గ్రాంట్‌


నిన్నటి దాకా ఎలక్ట్రిక్‌ బైక్‌లు.. ఎలక్ట్రిక్‌ కార్లు.. ఇప్పుడు ఇక ఎలక్ట్రిక్‌ విమానాల వంతు వచ్చేసింది. శిలాజ ఇంధనాల అవసరం లేకుండానే కరెంటుతోనే నడిచే విమానాలు వచ్చేశాయి. ప్రపంచంలోనే తొలిసారిగా విద్యుత్తుతో నడిచే విమానం గాలిలో చక్కర్లు కొట్టింది. ఈవియేషన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సంస్థ తయారుచేసిన ఈ విమానం వాషింగ్టన్‌లోని గ్రాంట్‌ కౌంటీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 3,500 అడుగుల ఎత్తుకు ఎగిరింది.దాదాపు 8 నిమిషాల పాటు ఈ విమానం గాలిలో ప్రయాణించింది. మొట్టమొదటి ఉద్గారాల రహిత విమానాన్ని విజయవంతంగా నడిపించామని ఈవియేషన్‌ సంస్థ అధ్యక్షుడు, సీఈవో గ్రెగోరీ డేవిస్‌ తెలిపారు. కాగా, అమెరికాకు చెందిన కేప్‌ ఎయిర్‌ 75 యూనిట్లు, గ్లోబల్‌ ఎక్స్‌ ఎయిర్‌లైన్స్‌ 50 యూనిట్లకు ఆర్డర్‌ ఇచ్చాయి. మూడు వేరియంట్లలో 9 సీటర్‌ కమ్యూటర్‌ ఒకటి, 6 సీటర్‌ ఎగ్జిక్యూటివ్‌ క్యాబిన్‌ రెండోది, మూడవ ఈ కార్గోను ఈవియేషన్‌ కంపెనీ తయారుచేయనుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

Follow us on