ట్రెండ్ మారింది గురూ.. వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
బెంగళూరులో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బైక్‌పై ల్యాప్‌టాప్ తెరిచి ఆఫీస్ పని చేస్తున్న యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్రీన్ సిగ్నల్ పడేలోపు డెడ్‌లైన్ పూర్తి చేయాలనే ప్రయత్నం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. కొందరు అతని నిబద్ధతను ప్రశంసిస్తుండగా, మరికొందరు కార్పొరేట్ ఉద్యోగులపై పెరుగుతున్న ఒత్తిడికి ఇదే నిదర్శనమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఐటీ రాజధాని బెంగళూరులో కార్పొరేట్ ఉద్యోగుల జీవితం ఎంతటి ఒత్తిడితో సాగుతుందో చాటిచెప్పే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మనం ఇప్పటివరకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’, ‘వర్క్ ఫ్రమ్ ఆఫీస్’ చూశాం కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది.. అదే.. ‘వర్క్ ఫ్రమ్ ట్రాఫిక్ సిగ్నల్’. రోడ్డుపైన సిగ్నల్ పడగానే బైకుపైన వాలిపోయి రెస్ట్ తీసుకుంటారు కొంతమంది. కానీ ఈ యువకుడు మాతరం రోడ్డుపై రెడ్ సిగ్నల్ పడగానే బైక్‌పైనే ల్యాప్‌టాప్ తెరిచి వేగంగా ఆఫీస్ పని పూర్తి చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. రోడ్డుమీద వాహనాలు దూసుకుపోతున్నాయి. ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరకు రాగానే రెడ్ సిగ్నల్ పడింది. వాహనాలన్నీ వరుసగా నిలిచిపోయాయి. ఇంత బిజీలోనూ ఒక బైకర్ తన వాహనాన్ని ఆపి, గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేయకుండా.. సిగ్నల్ ముగిసే కొద్ది సెకన్ల వ్యవధిలోనే బ్యాగ్ నుంచి ల్యాప్‌టాప్ బయటకు తీసి, బైక్ హ్యాండిల్‌పైనే ఉంచి వర్క్ చేయడం ప్రారంభించాడు. మరోవైపు హెడ్‌ఫోన్స్ పెట్టుకున్న అతను ఫోన్లో అవతలి వ్యక్తికి సమాధానం చెబుతున్నాడు. గ్రీన్ సిగ్నల్ పడేలోగా డెడ్‌లైన్ పూర్తి చేయాలనే అతని ఆరాటాన్ని.. వెనుక ఉన్న మరొక వాహనదారుడు కెమెరాలో బంధించి నెట్‌లో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆ యువకుడి నిబద్ధతను, సమయపాలనను ప్రశంసించగా.. మెజారిటీ నెటిజన్లు మాత్రం కార్పొరేట్ సంస్కృతిలోని మితిమీరిన ఒత్తిడిని తీవ్రంగా నిరసించారు. రోడ్డుపై ఇలా దృష్టి మళ్లించి పనిచేయడం ప్రమాదకరమని హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!
17 రోజుల మాతృవేదన.. ప్రపంచాన్ని కదిలించిన తల్లి తిమింగలం కథ!
డైనోసార్లను తుడిచిపెట్టిన గ్రహశకలం.. మిస్టరీ ఛేదించిన శాస్త్రవేత్తలు!
