ప్రస్తుత కాలంలో కొంతమంది జనాలు మరీ క్రేజీగా ఉంటున్నారు. ఎంత క్రేజీ అంటే.. చిన్న చిన్న విషయాలకే రచ్చ రచ్చ చేసేస్తున్నారు. అవును.. తాజాగా ఓ మహిళ తన ఆర్డర్‌లో చికెన్ ముక్కలు తక్కువగా వచ్చాయని ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేసింది. ఈ ఇష్యూ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈఘటన అమెరికాలో జరిగినట్టుగా తెలిసింది.యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని క్లీవ్ ల్యాండ్‌కు చెందిన ఓ మహిళ కేఎఫ్‌సీ చికెన్ ఆర్డర్ ఇచ్చింది. డెలివరీ బాయ్.. ఆర్డర్ తీసుకువచ్చి ఇచ్చారు. అయితే, ఆ ఆర్డర్‌లో చికెన్ పీసెస్ తక్కువగా పడ్డాయట. దాంతో ఆగ్రహానికి గురైన సదరు మహిళ.. నేరుగా పోలీస్ కంప్లైట్ నెంబర్ 911 కి కాల్ చేసింది. ఫాస్ట్ చైన్ కేఎఫ్‌సీ పై ఫిర్యాదు చేసింది. కేఎఫ్‌సీకి తాను 8 చికెన్ పీసెస్ కోసం ఆర్డర్ చేస్తే.. కేవలం 4 పీసెస్ మాత్రమే వచ్చాయంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.అయితే, మహిళ వాదనను విన్న పోలీసులు.. ఆ తరువాత చేతులెత్తేశారు. ఆమె ఫిర్యాదుపై సహాయం చేయలేమంటూ బదులిచ్చారట అక్కడి పోలీసులు. ఇది సివిల్ విషయం అని, క్రిమినల్ విషయం కాదని వివరించారట. ఈ కేసులో రెస్టారెంట్ మాత్రమే మీకు సహాయం చేస్తుందని సదరు మహిళకు పోలీసు అధికారులు సూచించారట. అలాగే, ఇలాంటి చిల్లర కాల్స్ చేసి సమయాన్ని వృథా చేయొద్దని మహిళకు గట్టి వార్నింగ్ ఇచ్చారు పోలీసులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Syllabus Pattu Job Kottu: పోలీస్ జాబ్ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..
Kangana Ranaut: ‘వాడు తాకరాని చోట తాకాడు’ .. ఆ మూర్ఖుడి గురించి నిజం చెప్పిన కంగన..
Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైనే మొదలెట్టేశారు.. పోటాపోటీగా వినూత్న ప్రయోగం..