వీధి శునకాలపై ప్రేమ.. చెంప దెబ్బలకూ వెనకాడని మహిళ
వీధి కుక్కల స్వైర విహారంతో ప్రజల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతోందన్న అంశాన్ని ఇటీవల సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. వీధుల్లో ప్రమాదకరంగా సంచరించే కుక్కలను తగు షెల్టర్లు ఏర్పాటు చేసి వాటిని అక్కడకు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో ఒక దారుణ ఘటన జరిగింది.
ఘజియాబాద్‌లో వీధి కుక్కలను ఆహారం పెడుతున్న ఒక మహిళను అదే అపార్ట్‌మెంట్‌లో ఉండే మరో వ్యక్తి అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాదన జరిగింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి.. కుక్కకు ఆహారం పెడుతున్న మహిళ చెంపపై చాచికొట్టటం, ఆ తర్వాతి పరిణామాలు సంచలనంగా మారాయి. ఘజియాబాద్‌లోని విజయ్ నగర్‌లోని బ్రహ్మపుత్రా సొసైటీలో ఈ ఘటన జరిగింది. తన అపార్ట్‌మెంట్ ప్రాంగణంలోకి వచ్చిన ఓ వీధికుక్కకు ఒక మహిళ ఆహారంపెట్టింది. ఇది చూసిన అదే అపార్ట్‌మెంట్ లో ఉండే కమల్ ఖన్నా అనే వ్యక్తి..‘ ఇక్కడ ఎందుకు కుక్కకు ఆహారం పెడుతున్నావు?’ అని ఆమెను నిలదీశాడు. దీనికి ఆమె బదులిస్తూ.. ‘ఇందులో తప్పేముంది?’అని ఎదురు ప్రశ్నించింది. దీంతో ఆగ్రహానికి లోనైన ఆ వ్యక్తి.. ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు. అయితే.. ఆమె మాత్రం అతడి చెంపదెబ్బను పట్టించుకోకుండా.. కుక్కకు ఆహారం పెడుతూనే ఉండిపోయింది. అదే సమయంలో.. తన పక్కనే ఉన్న స్నేహితురాలిని వీడియో తీయమని.. ఆ మహిళ చెప్పింది. తాను వద్దని చెబుతున్నా కుక్కకు ఆహారం పెట్టటమే గాక.. ఇదేంటని నిలదీసిన తనను వీడియో తీయమని ఆ మహిళ చెప్పటంతో.. కమల్ ఖాన్నా రెచ్చిపోయాడు. వరుసగా 38 సెకన్ల వ్యవధిలో ఆమెను 8 చెంప దెబ్బలు కొట్టాడు. అనంతరం ఆమె ఈ వీడియోను సోషల్ మీడియాకి అప్‌లోడ్ చేయడంతో .. అది వైరల్‌గా మారింది. పోలీసుల దృష్టికి వీడియో చేరడంతో చెంప దెబ్బలు కొట్టిన వ్యక్తి కమల్ ఖన్నాను పోలీసులు అరెస్ట్ చేసారు. ఢిల్లీలో వీధి కుక్కల సమస్యపై కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు జంతు ప్రేమికుల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తడంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు అభ్యంతరం వ్యక్తంచేయడంతో.. ఆ ఉత్తర్వులో మార్పులు చేస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. కుక్కలకు స్టెరిలైజేషన్ పిల్లలు పుట్టకుండా శస్త్రచికిత్స పూర్తి చేసిన తర్వాత ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే వదిలేయాలని తేల్చిచెప్పింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాపకు కానుకగా బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్! వైరల్‌గా వీడియో
క్యాంటిన్ టీ తాగి.. కుప్పకూలిన మెడికో
ఐదేళ్ల క్రితం బహ్రెయిన్‌లో మృతి.. ఇప్పుడు అంత్యక్రియలు
దెయ్యం పట్టిందని భర్తను చితక్కొట్టిన భార్య.. ఆ తరువాత సీన్ ఇదే