ఆమె అరుపు విని కాకులే మోసపోయాయిగా..వీడియో

Updated on: Sep 17, 2025 | 8:35 PM

చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు రకరాల వాయిస్‌లు ఇమిటేట్‌ చేయడం మనం చూశాం. మనుషుల వాయిస్‌లే కాకుండా పక్షులు, జంతువుల అరుపులు కూడా ఇమిటేట్ చేస్తుంటారు. తాజాగా ఓ సాధారణ మహిళ కాకులను ఇమిటేట్‌చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందులో వింతేముంది.. అనుకుంటే పొరపాటే.. ఆమె అరుపు విని కాకులన్నీ వచ్చి చేరాయంటే ఆమె ట్యాలెంట్‌ అర్ధం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆమె ట్యాలెంట్‌కు ప్రశంసలు కురిపిస్తున్నారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ ఇంటి డాబా పైన ఓ మహిళ ఉంది. అక్కడ మరో వ్యక్తి వీడియో తీస్తున్నాడు. అతను ఆమె కాకిలా అరవగలదని, ఆమె అరుపు విని కాకులు అక్కడికి వచ్చి చేరుతాయని చెబుతాడు. అయితే ఆ సమయంలో ఆ చుట్టుపక్కల ఎక్కడా కాకులు లేవు. ఆకాశంలో కూడా కాకులు ఎగురుతున్న దాఖలాలు లేవు. అయితే ఆ మహిళ రెండు చేతులూ తన నోటివద్ద ఉంచి కావ్‌..కావ్‌.. అంటూ అరిచింది. ఆమె అరుపు అచ్చం కాకిలానే ఉంది. ఆ అరుపు విన్న వెంటనే కాకులు ఎక్కడినుంచి వచ్చాయో కానీ ఆ ఇంటి డాబా చుట్టూ అరుస్తూ తిరుగుతున్నాయి. తమ తోటి కాకికి ఏదో ఆపద వచ్చిందనుకొని ఆ కాకులన్నీ అరుస్తూ అక్కడ ఎగురుతూ వెదుకుతున్నాయి. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. వీడియోను వేలాదిమంది వీక్షిస్తూ లైక్ చేశారు. వావ్‌..ఈమె కాకులకు సోదరి అనుకుంటా అని ఒకరు.. సూపర్‌ ట్యాలెంట్ అంటూ మరొకరు కామెంట్లు చేశారు.

మరిన్నివీడియోల కోసం :

భయం లేదు.. అప్రమత్తంగా ఉంటే చాలు వీడియో

ఆ మరణాలు బొడ్రాయి వల్లేనా?వీడియో

నన్నే కాటు వేస్తావా.. పామును తాత ఏం చేశాడంటే? వీడియో

జ‌పాన్‌లో ల‌క్షకు చేరిన 100 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య వీడియో