భయానకం.. ఆ అనుభవం,రైలు టాయిలెట్‌లో లాక్ చేసుకున్న మహిళ వీడియో
జానకి ఎక్స్‌ప్రెస్‌లో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళకు భయానక అనుభవం ఎదురైంది. కతిహార్ జంక్షన్ వద్ద 30-40 మంది యువకులు కోచ్‌లోకి దూసుకురావడంతో ఆమె వాష్‌రూమ్‌లో లాక్ చేసుకుంది. రైల్వే హెల్ప్‌లైన్‌కు కాల్ చేయగా, ఆర్పీఎఫ్ సిబ్బంది ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటన రైలు ప్రయాణ భద్రతపై ఆందోళనలు రేకెత్తించింది.
రైలులో ఒంటరిగా ప్రయాణించే మహిళలకు భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. బీహార్‌లోని కతిహార్ జంక్షన్ వద్ద జానకి ఎక్స్‌ప్రెస్ బోగీలో జరిగిన ఒక భయానక సంఘటనతో ఈ విషయం రుజువైంది. ఒక మహిళా ప్రయాణికురాలు రైలు వాష్‌రూమ్‌లో తనను తాను లాక్ చేసుకుంది. ఈ ఘటన కతిహార్ జంక్షన్ వద్ద జరిగింది. సుమారు 30 నుంచి 40 మంది యువకులు అరుస్తూ, ఒకరినొకరు తోసుకుంటూ అక్రమంగా రైలు కోచ్‌లోకి దూసుకొచ్చారు. ఈ గందరగోళ పరిస్థితులతో భయపడిన ఆ మహిళ, అప్పటికి వాష్‌రూమ్‌లో ఉండటంతో వెంటనే లోపలి నుంచి తలుపు వేసుకుంది. బయట జనం కేకలు వేస్తూ, వాష్‌రూమ్ తలుపులు కొట్టడంతో ఆమె తీవ్ర భయాందోళనకు గురైంది.
మరిన్ని వీడియోల కోసం :
