రైల్లో ప్రయాణిస్తుండగా గర్భిణికి పురిటి నొప్పులు..అంతలోనే వీడియో

Updated on: Sep 07, 2025 | 10:02 PM

రైలులో ప్రయాణిస్తున్న ఓ గర్భిణికి శ్రీకాకుళంలో ప్రసవం జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని భూలక్ష్మి అనే గర్భిణి తన భర్త జానకిరాంతో కలిసి కోనార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో విశాఖపట్నం వెళుతుండగా మార్గమధ్యంలో ఆమెకు పురుటినొప్పులు మొదలయ్యాయి. వెంటనే జానకిరాం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులకు సమాచారం అందించారు.

రైలులో ప్రయాణిస్తున్న ఓ గర్భిణికి శ్రీకాకుళంలో ప్రసవం జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని భూలక్ష్మి అనే గర్భిణి తన భర్త జానకిరాంతో కలిసి కోనార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో విశాఖపట్నం వెళుతుండగా మార్గమధ్యంలో ఆమెకు పురుటినొప్పులు మొదలయ్యాయి. వెంటనే జానకిరాం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులకు సమాచారం అందించారు. వారు తక్షణమే స్పందించి శ్రీకాకుళం రైల్వేస్టేషన్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. రైలును శ్రీకాకుళం స్టేషన్ వద్ద నిలిపివేయగా ఆర్ పీఎఫ్ సిబ్బంది సమాచారంతో అప్పటికే అక్కడికి చేరుకున్న వైద్యురాలు డాక్టర్ పల్లవి కీర్తి గర్భిణి భూలక్ష్మి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి రైలులోనే సురక్షితంగా ప్రసవం జరిపించారు. ఈ సందర్భంగా భూలక్ష్మి ఇద్దరు ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి పిల్లలను మెరుగైన వైద్యం కోసం రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన ఆర్‌పీఎఫ్ సిబ్బందికి, వైద్యురాలు డాక్టర్ పల్లవి కీర్తికి, రైల్వే సిబ్బందికి భూలక్ష్మి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం :

ఇరగదీసిన అమ్మాయిలు..కుర్చీ మడతబెట్టి పాటకు అదిరిపోయే స్టెప్స్ వీడియో

పండగ స్పెషల్.. అమెజాన్ Vs ఫ్లిప్‌కార్ట్‌‌లో కళ్లు చెదిరే ఆఫర్స్.. వీడియో

ఈ ఐఏఎస్‌ల పెళ్లి ఖర్చు.. కేవలం రెండు వేలే వీడియో

బ్లడ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌లోని కీలకాంశాలు మీకు తెలుసా? వీడియో