Viral Video : బాస్‌ని చితకబాదేసిన మహిళా ఉద్యోగి..! మామూలుగా కాదు చీపురు తిరగేసి మరీ కొట్టింది.. ఎందుకో తెలుసా..?

Woman Beaten Her Boss Viral Video : కార్యాలయంలోని మహిళా ఉద్యోగులకు డర్టీ మెస్సేజ్‌లు పంపే బాస్‌ని ఓ మహిళా ఉద్యోగి చితకబాదింది.

Viral Video : బాస్‌ని చితకబాదేసిన మహిళా ఉద్యోగి..! మామూలుగా కాదు చీపురు తిరగేసి మరీ కొట్టింది.. ఎందుకో తెలుసా..?
Woman Beaten Her Boss

Updated on: Apr 15, 2021 | 8:10 PM

Woman Beaten Her Boss Viral Video : కార్యాలయంలోని మహిళా ఉద్యోగులకు డర్టీ మెస్సేజ్‌లు పంపే బాస్‌ని ఓ మహిళా ఉద్యోగి చితకబాదింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రత్యేకత ఏమిటంటే ఈ మహిళా ఉద్యోగిని అందరూ అభినందిస్తున్నారు. ఈ వీడియోను బాధితురాలు స్వయంగా చిత్రీకరించింది. అందులో ఆమె తన యజమానిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఈ వీడియో చైనాకు చెందినదని చెబుతున్నారు.

ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగి చేసిన ఆరోపణ ప్రకారం.. ఆమె యజమాని ఎప్పుడూ ఆమెను లైంగికంగా వేధించేవాడు. ఎప్పుడూ ఆమెకు అశ్లీల సందేశాలను పంపించేవాడు. దీంతో ఓపిక నశించిన ఆమె బాస్‌కి తగిన గుణపాఠం చెప్పాలనుకుంది. కోపంతో అతడిపై విరుచుకుపడింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆమె కోపంతో బాస్ క్యాబిన్లోకి వెళుతుంది. ఒక కుండ నీళ్ళు తీసుకొని అతడి మొహంపై విసురుతుంది. అనంతరం వెనకున్న చీపురుతో యజమానిని కొట్టడం ప్రారంభిస్తుంది. తరువాత బాస్ ముందు ఉన్న పుస్తకం అతడిపై విసురుతుంది. అనంతరం చీపురుతో ఇష్టారీతిన కొడుతూ తిడుతుంది. అలా చేస్తూనే వీడియోను కూడా రికార్డ్ చేస్తుంది.

ఆ సమయంలో బాస్‌ మొహం దాచి క్షమాపణలు కోరుతాడు. తాను ఒక జోక్‌గా టెస్ట్ చేశాను అని సమాధానమిస్తాడు. దీనికి ఆ మహిళ మీ క్యారెక్టర్‌ ఎంత వరెస్టో తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా మహిళలను కార్యాలయ ఉద్యోగులుగా గౌరవించారా అని నిలదీస్తుంది. ఈ మొత్తం వీడియో 14 నిమిషాల నిడివి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే వీడియో చూసిన తర్వాత చాలా మంది మహిళను ప్రశంసించారు. అలాంటి వారికి అదే శిక్ష విధించాలని వ్యాఖ్యానించారు.

Viral Video: కటింగ్‌ షాప్‌లో ఎదురైన అనుభంతో 12 ఏళ్లు జుట్టు కత్తిరించుకోలేదు.. 3 గిన్నిస్‌ రికార్డులు సొంతం.. కానీ తాజాగా..

Breaking: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు.. ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్‌ వాయిదా..