అరుదైన 2 వేల సాలగ్రామాలతో శ్రీహరి సన్నిధి ప్రతిష్ఠ

|

Dec 31, 2023 | 7:38 PM

మైసూరు దత్తపీఠంలో అరుదైన సాలగ్రామాల ప్రతిష్ట వైభవంగా జరిగింది. అవదూత దత్తపీఠాధిపతి పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, ఉత్తరాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వార్ల అమృత హస్తాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏదైనా ఆలయ నిర్మాణానికి 100 సాలగ్రామాలు అవసరమని శాస్త్రవచనం. కానీ ప్రపంచంలోనే ఎక్కడా లేని అరుదైన 2000 సాలగ్రామాలతో శ్రీహరిసన్నిధి పేరిట ఆలయనిర్మాణం చేసి, పూజ్యస్వామీజీ అమృత హస్తాలతో సాలగ్రామాలను ప్రతిష్టించారు.

మైసూరు దత్తపీఠంలో అరుదైన సాలగ్రామాల ప్రతిష్ట వైభవంగా జరిగింది. అవదూత దత్తపీఠాధిపతి పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, ఉత్తరాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వార్ల అమృత హస్తాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏదైనా ఆలయ నిర్మాణానికి 100 సాలగ్రామాలు అవసరమని శాస్త్రవచనం. కానీ ప్రపంచంలోనే ఎక్కడా లేని అరుదైన 2000 సాలగ్రామాలతో శ్రీహరిసన్నిధి పేరిట ఆలయనిర్మాణం చేసి, పూజ్యస్వామీజీ అమృత హస్తాలతో సాలగ్రామాలను ప్రతిష్టించారు. మైసూరులో కొలువుతీరిన ఈ అద్భుత సాలగ్రామ ప్రతిష్టిత దేవాలయం భక్తులను అనుగ్రహిస్తోంది. మరోవైపు శ్రీ స్వామిజీ ..రాజరాజేశ్వరీ అమ్మవారి ఆలయం కూడా నిర్మించారు. ఈ ఆలయంలో దేవీశక్తిని నిక్షిప్తం చేసిన స్వర్ణ యంత్రాన్ని ప్రతిష్ఠచేసి, బ్రహ్మకలశంతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. ఆలయ శిఖరానికి కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీస్వామీజీ ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని అనుగ్రహ భాషణం చేసి ఆశీర్వదించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జైశ్రీరామ్‌ అంటున్న ముస్లిం యువతి..అయోధ్య వరకు పాదయాత్ర

ఫ్రీగా అయోధ్య హారతి పాసులు.. బుక్‌ చేసుకోండిలా

డిస్కౌంట్‌ ఎఫెక్ట్‌.. ఎగబడి చలాన్లు కడుతున్న జనాలు

అయోధ్యలో అంతర్జాతీయి విమానాశ్రయం పేరు మార్పు

ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు.. 50 మీటర్ల దూరంలో కూడా కనిపించని వాహనాలు

Follow us on