మొసలితో పోరాడి..భర్తను కాపాడుకున్న భార్య వీడియో

Updated on: Apr 19, 2025 | 2:32 PM

తన భర్త ప్రాణాన్ని కాపాడేందుకు ఓ మహిళ మొసలితో పోరాడింది. ఎంతో ధైర్యసాహసాల్ని ప్రదర్శించిన తీరు ఆకట్టుకుంది. అమెరికాలో దక్షిణ కరొలినాకు చెందిన జో రోసెర్ , మరియం రోసెర్‌ భార్యాభర్తలు. 55 ఏళ్లు నిండిన వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమ్యూనిటీలో నివసిస్తున్నారు. ఇద్దరూ తోట పనిలో నిమగ్నమై ఉండగా ఇటీవల ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు కానీ హఠాత్తుగా ఓ 8 అడుగుల ఎలిగేటర్‌ జో పై వెనక నుంచి దాడి చేసింది. అనుకోని ఘటన ఎదురుకావడంతో అక్కడే ఉన్న మరియం అప్రమత్తమైంది.

భారీ మొసలి అకస్మాత్తుగా దాడికి యత్నించడంతో ముందు ఆమె షార్ప్ గా ఆలోచించింది. దాదాపు ఎనిమిది అడుగుల పొడవున్న మొసలి.. మరియం భర్త జో ను టార్గెట్ చేసింది. అమాంతం అతడి కాలిని నోటపట్టి గాయపరిచే ప్రయత్నం చేసింది. ఇది చూసిన మరియం షాకైంది. ఆ పరిస్థితిల్లో ఏం చేయాలో అర్ధంకాక క్షణకాలం పాటు అలాగే నిలబడిపోయింది. ఆ వెంటనే తేరుకున్న ఆమె పక్కనే ఉన్న ఇనుప టొమాటో స్టేక్‌తో మొసలి కంట్లో బలంగా పొడిచింది. టొమేటోలు ఏపుగా పెరగడానికి సపోర్ట్‌గా కర్రలు పాతడాన్ని స్టేక్‌ అంటారు. కంటికి తీవ్ర గాయం కావడంతో.. మొసలి జో ను విడిచిపెట్టింది. ఈ క్రమంలో మరియంకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.