కనీ..వీనీ ఎరుగని వివాహం.. సహపంక్తి భోజనాలు కూడా వీడియో
పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. స్త్రీ పురుషులు వేదమంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటై కొత్త జీవితంలోకి అడుగుపెడతారు. ఇది మానవ జీవితంలో ఒక సంప్రదాయం. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇతర జీవులకు పెళ్లిళ్లు చేస్తుంటారు. వర్షం కోసం కప్పలకు పెళ్లి చేయడం మనం చూశాం. తాజాగా ఓ రైతు తన పొలంలో మొదటిసారి కాపుకొచ్చిన మామిడి చెట్లకు వైభవంగా వివాహం జరిపించి ప్రకృతి పట్ల తనకున్న నిబద్ధతను చాటుకున్నాడు. గ్రామస్తులతో కలిసి రెండు మామిడి చెట్లకు పెళ్లి చేశారు.
ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బీర్ పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన ఓగుల అనిల, అజయ్ దంపతులు 8 ఎకరాల్లో మామిడి తోట వేశారు. నాటిన నాలుగేళ్ల తర్వాత తొలిసారి మామిడితోట కాపుకొచ్చింది. దీంతో మామిడి చెట్లకు వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా గ్రామస్థులను, బంధువులను తోటకు ఆహ్వానించి ఘనంగా ఆ తంతు నిర్వహించారు. అయితే ఇదేదో తూతూ మంత్రంగా చేశారనుకుంటే పొరపాటే. పెళ్లికొచ్చిన వారందరికీ సహపంక్తి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. బీర్పూర్ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయ అర్చకుడు వొద్దివర్తి మధు కుమారాచార్యులు వేద మంత్రాలతో సంప్రదాయంగా మామిడి చెట్లకు వివాహం జరిపించారు. మొదటిసారి కాపుకొచ్చిన మామిడి చెట్లకు ఇలా వివాహం జరిపిస్తే మంచి దిగుబడి వస్తుందని నమ్ముతారు. అంతేకాదు తోట ఎప్పుడు పచ్చగా ఉంటుందని విశ్వసిస్తారు. చాలా ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఇలా మామిడి చెట్లకు పెళ్లి జరపడం ఆనావయితీగా వస్తోందని స్థానికులు చెబుతున్నారు.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
