AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చని సంసారంలో చిచ్చుపెట్టిన టీవీ సీరియల్! ఏమైందో చూడండి!

పచ్చని సంసారంలో చిచ్చుపెట్టిన టీవీ సీరియల్! ఏమైందో చూడండి!

Samatha J
|

Updated on: Aug 27, 2025 | 12:50 PM

Share

భర్త ఆకలికన్నా టీవీ సీరియల్ ముఖ్యమా అని భార్యను భర్త మందలించడమే పాపమైంది. నన్ను సీరియల్‌ చూడనియ్యవా అంటూ మనస్తాపానికి గురై బిడ్డతో సహా భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజులతండాలో వెలుగు చూసింది.

తండాకు చెందిన దారావత్ రాజు – కవిత దంపతులకు ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల భర్త రాజు పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చి అన్నం పెట్టమని భార్యను అడిగాడు.. అయితే అప్పటికే టీవీ సీరియల్‌లో మునిగిపోయిన భార్య.. అడ్వర్టైజ్మెంట్ వచ్చేటప్పుడు అన్నం వడ్డిస్తానని భర్తతో చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది.దీంతో భర్త నా ఆకలికంటే నీకు సీరియల్ ముఖ్యమా అని ఆగ్రహం వ్యక్తం చేసి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. భర్త తనపై కోపగించుకోవడంతో మనస్థాపానికి గురైన భార్య సంచలన నిర్ణయం తీసుకుంది. తన కుమారుడికి పురుగుల మందు తాగించి.. తాను కూడా అదే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.. కూతురికి తాగిస్తుండగా అప్పటికే బయటినుంచి ఇంటికి వచ్చిన భర్త గమనించి అడ్డుకున్నాడు.

మరిన్ని వీడియోల కోసం :

ఖైరతాబాద్‌ గణపతిని చూశారా?వీడియో

తాత నువ్వు కేక.! ఇలా కూడా వ్యాపారం చేయొచ్చా?వీడియో

కొడుకు ప్రాణాల కోసం.. మొసలితో తల్లి ఫైటింగ్‌ వీడియో