వైకుంఠ ద్వార దర్శనం ప్రాధాన్యత ఏమిటంటే?

|

Jan 15, 2025 | 5:59 PM

ఉత్తర ద్వార దర్శనం కేవలం వైకుంఠ ఏకాదశి రోజే చేసుకోవాలా? అంటే వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. దక్షిణాయనం మొత్తం నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు నిద్రలేచే సమయం ఇది. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటే పుణ్యం వస్తుంది అని భక్తుల విశ్వాసం. అయితే వైకుంఠ ద్వారదర్శనం కోసం టోకెన్లు జారీ చేసే కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగింది. దీంతో ఆరుగురు భక్తులు మృతి చెందారు, 48 మంది గాయపడ్డారు. ఇందులో టీటీడీ అధికారుల తప్పు ఉండి ఉండొచ్చు. పోలీసుల వైఫల్యమూ కారణం కావొచ్చూ. కానీ ఆ రెండింటి కంటే ముఖ్యమైనది ఈ ఘటనలో స్పష్టంగా కనిపిస్తోంది స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలన్న

భక్తుల ఆత్రుత, తాపత్రయాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఒకేసారి ఎక్కువమంది రావడంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. వాస్తవానికి వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏటికేడు భారీగా పెరుగుతోంది..వారిని కంట్రోల్ చేయడం కష్టంగా మారడంతో గత రెండు మూడేళ్లుగా పది రోజుల పాటూ వైకుంఠ ద్వార దర్శనాలు అందుబాటులోకి తీసుకొచ్చారు టీటీడీ అధికారులు. ఈ పది రోజుల్లో ఏ రోజు ఉత్తరద్వార దర్శనం చేసుకున్నా శుభమే. ఆ పది రోజుల్లో క్రౌడ్ కంట్రోల్ చేసేందుకు విడతలవారిగీ టోకెన్లు జారీ చేస్తున్నారు. ఒకేసారి టోకెన్లు జారీ చేసినా ఇబ్బందే అని ఆలోచించి మొదటి మూడు రోజలకు ఒకసారి.. ఆ తర్వాత దర్శనానికి ముందురోజున టోకెన్లు ఇస్తున్నారు. అందుకోసం ఎక్కడికక్కడ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జనవరి 9 ఉదయం నుంచి టోకెన్లు ఇస్తారని తెలిసి…జనవరి 8 అర్థరాత్రి పోటెత్తారు భక్తులు. ఆ ఫలితమే తిరుపతిలో జరిగిన విషాద ఘటన.

Published on: Jan 15, 2025 05:58 PM