చావుకు ముందు ఏం జరుగుతుంది ?? మరణాన్ని ఆపేందుకు మెదడు పోరాడుతుందా ??

Updated on: Apr 21, 2025 | 4:23 PM

మరణం.. మనిషి జీవితంలో ఆఖరి ఘట్టం. పుట్టిన ప్రతీ జీవికి చావు తప్పదు. దాన్ని ఎవరూ తప్పించుకోలేరు. అయితే చనిపోయే సమయంలో ఏం జరుగుతుంది.? మెడికల్ సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందినా.. ఇప్పటికీ ఇది అంతుచిక్కని రహస్యమే. శరీరంలో ఏం జరిగినా వెంటనే స్పందించే మెదడు.. మరణం సమీపిస్తున్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది..?

గాయం తగిలినప్పుడు స్పందించినట్లే అంతిమ ఘడియల్లోనూ మరణాన్ని ఆపేందుకు మెదడు పోరాడుతుందా.? అసలు న్యూరో సైంటిస్టులు ఏం చెబుతున్నారు.? కళ్లు తెరిస్తే జననం.. కళ్లు మూస్తే మరణం.. ఈ రెప్పపాటే జీవితం అని అంటారు. నిజమే జనన – మరణాలు మనిషి చేతిలో ఉండవు. ముఖ్యంగా చావును ఆపడం ఎవరితరం కాదు. రెండు జన్మల మధ్య విరామమే మరణం అని నమ్మేవారు చాలా మంది ఉన్నారు. నిజానికి మరణాన్ని నిర్వచించడం చాలా కష్టం. ఒకప్పుడు గుండె ఆగిపోవడమే మరణమనేవారు. కానీ ఇప్పుడు మెడికల్ సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. ఆగిన గుండె మళ్లీ స్పందించేలా చేస్తోంది. కానీ మనిషి చావుకు దగ్గరవుతున్న సమయంలో ఏం జరుగుతుందని ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఇలా జరుగుతుండొచ్చని అంచనా వేసినవారే తప్ప కచ్చితంగా ఇదే జరుగుతుందని ఎవరూ బల్లగుద్ది చెప్పిన దాఖలాలు లేవు. జర్మనీలోని యూనివర్శిటీ ఆఫ్ ఛారిటీ.. అమెరికాలోని సిన్సినాటి యూనివర్సిటీ సైంటిస్టులు మనిషి చావు గురించి అనేక పరిశోధనలు చేశారు. ఆ సమయంలో మెదడు ఎలా స్పందిస్తుందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విద్యార్ధుల కోసం ప్రిన్సిపాల్‌ చేసిన ఈ పనికి.. అందరూ ఆశ్చర్యపోతున్నారు

వీగన్‌ డైట్‌ చేస్తున్నారా.. ఇది మీకోసమే..!

భర్త అన్నాక గొడవపడనా ?? అంత మాత్రానికే విడాకులా ?? ప్లేటు ఫిరాయించిన అమర్ భార్య!

ఇది మామూలు పూల చొక్కా కాదు.. రేట్‌ తెలిస్తే.. గుండె జారుతుంది

Naga Chaitanya: చైతూకు ఇంకో తమ్ముడు ఉన్నాడా ??