ఇదేం.. ఖర్మ రా నాయనా !! ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు
పురుషులు, మహిళలు పెళ్లి చేసుకోవడం సాధారణమే..కానీ, ఇద్దరు ఆడవాళ్లు పెళ్లిచేసుకుంటే అది కచ్చితంగా న్యూసే. యస్.. మీరు వింటున్నది నిజమే ఇద్దరు మహిళలు సామాజిక కట్టుబాట్లను అధిగమించి, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది. ప్రొఫెషనల్ డ్యాన్సర్లు అయిన వారిద్దరు ఓ గుడిలో వివాహం చేసుకున్నారు.
పురుషులు, మహిళలు పెళ్లి చేసుకోవడం సాధారణమే..కానీ, ఇద్దరు ఆడవాళ్లు పెళ్లిచేసుకుంటే అది కచ్చితంగా న్యూసే. యస్.. మీరు వింటున్నది నిజమే ఇద్దరు మహిళలు సామాజిక కట్టుబాట్లను అధిగమించి, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది. ప్రొఫెషనల్ డ్యాన్సర్లు అయిన వారిద్దరు ఓ గుడిలో వివాహం చేసుకున్నారు. పైగా ఓ మహిళ కుటుంబం వారి పెళ్లికి మద్దతు ఇవ్వడం కొసమెరుపు. మందిర్‌బజార్‌కు చెందిన రియా సర్దార్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో బంధువుల ఇంట్లో పెరిగింది. రెండేళ్ల కిందట బకుల్తాలాకు చెందిన రాఖీ నస్కర్, రియా కలుసుకున్నారు. డ్యాన్సర్లు అయిన వీరిద్దరి మధ్యా స్నేహం పెరిగింది. అది ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. రాఖీతో సంబంధం గురించి తన కుటుంబానికి రియా చెప్పింది. ఇద్దరు మహిళల మధ్య ప్రేమ సంబంధాన్ని ఆమె కుటుంబం అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో రియా తన కుటుంబాన్ని వీడింది. వీరి సంబంధానికి మద్దతిచ్చిన రేఖా ఇంటికి ఆమె చేరింది. సామాజిక అడ్డంకులను ఛేదించిన ఇద్దరు మహిళలు గుడిలో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. ఒకరి మెడలో మరొకరు పూలదండలు వేశారు. పెళ్లి తర్వాత రియా, రేఖా మీడియాతో మాట్లాడారు. ప్రేమకు లింగ భేదం, సరిహద్దులు లేవన్నారు. నిజమైన ప్రేమే తమకు ముఖ్యమని తెలిపారు. ‘మా స్వంత కోరికలను మేం గౌరవించాం. ప్రేమ నిజంగా ముఖ్యమైనది. ఒక స్త్రీ మాత్రమే పురుషుడిని ప్రేమించగలదని లేదా ఒక పురుషుడు మాత్రమే స్త్రీని ప్రేమించగలడని ఎవరు నిర్ణయించారు? ఒక స్త్రీ కూడా మరో స్త్రీని ప్రేమించగలదు’ అని అన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిట్టి చేతులతో.. ముద్దుగా మట్టి బొమ్మలు అర్హ క్యూట్ వీడియో
ఆటోలో దూసుకెళ్తున్న డ్రైవర్.. వెనుక సీటులో ఉన్నది చూసి..
బియ్యం ధర గిన్నీస్ వరల్డ్ రికార్డ్.. తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే