పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..

|

Jul 16, 2024 | 7:42 PM

పూరీ రత్నభాండాగారంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. 46 ఏళ్ల కింద పూరీ జగన్నాథుని రత్నభాండాగారం తెరిచారు. అధికారంలోకి వస్తే పూరీ భాండాగారాన్ని తెరిపిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అందుకోసం జస్టిస్‌ విశ్వనాథ్‌ నేతృత్వంలో కమిటీని కూడా నియమించింది. 12వ శతాబ్దంలో పూరీ జగన్నాథునికి అనేక వజ్ర, రత్నాభరణాలను సమర్పించారు. ఒడిశాను పాలించిన అనేకమంది రాజులతోపాటు నేపాల్‌ పాలకులు సైతం ఇక్కడి స్వామికి అత్యంత విలువైన వజ్రవైఢూర్యాలను కానుకలుగా ఇచ్చారు.

పూరీ రత్నభాండాగారంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. 46 ఏళ్ల కింద పూరీ జగన్నాథుని రత్నభాండాగారం తెరిచారు. అధికారంలోకి వస్తే పూరీ భాండాగారాన్ని తెరిపిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అందుకోసం జస్టిస్‌ విశ్వనాథ్‌ నేతృత్వంలో కమిటీని కూడా నియమించింది. 12వ శతాబ్దంలో పూరీ జగన్నాథునికి అనేక వజ్ర, రత్నాభరణాలను సమర్పించారు. ఒడిశాను పాలించిన అనేకమంది రాజులతోపాటు నేపాల్‌ పాలకులు సైతం ఇక్కడి స్వామికి అత్యంత విలువైన వజ్రవైఢూర్యాలను కానుకలుగా ఇచ్చారు. మిగతా రాజులు సైతం యుద్ధాల్లో గెలుచుకున్న ధనరాశులను స్వామికి సమర్పించారు. వీటిన్నింటినీ ఆలయం కింద రహస్య గదుల్లో భద్రపరిచారు. వీటికి విషసర్పాలు కాపలాగా ఉంటాయని.. నాగబంధనం వేశారన్న ప్రచారం ఉంది.

అనంత పద్మనాభస్వామి నేలమాళిగల్లో ఉన్నదానికంటే ఎక్కువ నిధి ఇక్కడ ఉందనేది అంచనా. ఇది లక్షల కోట్ల విలువ ఉంటుందని భావిస్తున్నారు. చివరిసారిగా 1978లో రహస్య గదిని ఓపెన్‌ చేశారు. ఆనాడు 70 రోజుల పాటు లెక్కింపు సాగింది. పూరీ జగన్నాథుని ఆలయం కింద రెండు భాగాలుగా ఈ రత్న భాండాగారం ఉంది. కింది భాగంలో ఈ రహస్య గది ఉంది. ఇందులో మొత్తం 5 చెక్కపెట్టెలు ఉన్నాయి. ఒక్కో పెట్టె పొడవు 9 అడుగులు, 3 అడుగుల ఎత్తు ఉన్నట్టు గత నివేదికలు చెబుతున్నాయి. ఈ పెట్టెల్లో అత్యంత విలువైన వజ్ర వైఢూర్యాలు, స్వర్ణాభరణాలు, వెండి వస్తువులు ఉన్నాయని చెబుతారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on