అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్‌లైన్‌లోనే పెద్దల ఆశీస్సులు!

Updated on: Sep 02, 2026 | 6:59 PM

అమెరికాలో వివాహం చేసుకుంటున్న కుమార్తెకు తల్లిదండ్రులు వేల కిలోమీటర్ల దూరం నుంచే అక్షింతలు వేసి ఆశీర్వదించారు. సూర్యాపేట జిల్లా వేపల సింగారానికి చెందిన హిమబిందు, అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ ఏపీకి చెందిన రోహిత్‌ కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీసా సమస్యలతో తల్లిదండ్రులు అమెరికా వెళ్లలేకపోవడంతో వీడియో కాల్‌ ద్వారా వివాహ వేడుకను వీక్షించారు. స్క్రీన్‌పై కనిపిస్తున్న వధూవరులపై అక్షింతలు చల్లి ఆశీర్వదించారు.

గతంలో పెళ్లంటే నెలరోజుల ముందునుంచే ఎంతో హడావిడి ఉండేది. చుట్టాలు బంధువుల ఇళ్లకు వధూవరుల తల్లిదండ్రులు స్వయంగా వెళ్లి శుభలేఖ ఇచ్చి బొట్టు పెట్టి పెళ్లికి రావాలని ఆహ్వానించేవారు. పచ్చని పందిరిలో పురోహితులు, బంధుమిత్రుల ఆశీర్వాదంతో వేదమంత్రాలతో అంగరంగా వైభవంగా జరిగేది. ప్రస్తుతం కాలం మారిపోయింది. అంతా ఆన్‌లైన్‌ మయమైపోయింది. అవసరమైన వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టడం కాదు.. ఇప్పుడు ఆశీర్వాదాలు కూడా ఆన్‌లైన్‌లోనే తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. అందుకు ఉదాహరణే ఈ ఘటన. విధి నిర్వహణలో భాగంగా విదేశాల్లో స్థిరపడుతున్న నేటి యువత, తమ జీవితంలో అత్యంత ప్రధానమైన వివాహ ఘట్టాన్ని కూడా వినూత్నంగా మార్చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపల సింగారానికి చెందిన జయరాజు, జ్యోతి దంపతుల ఏకైక కుమార్తె హిమబిందు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఆమెకు, ఏపీ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రోహిత్ కుమార్‌తో పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే వీసా సమస్యలు, ఇతర కారణాల వల్ల పెద్దలు అమెరికా వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. దీంతో అమెరికాలోనే సింపుల్‌గా వివాహం చేసుకోవాలని వధూవరులు నిర్ణయించుకున్నారు. అక్కడ కూతురి పెళ్లి జరుగుతుంటే, ఇక్కడ తల్లిదండ్రులు చూడలేకపోవడమేంటని వారు ఆవేదన చెందలేదు. టెక్నాలజీని ఉపయోగించుకుని సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అమెరికాలో హిమబిందు, రోహిత్‌ల మెడలో పూలమాలలు పడుతుండగా, ఇక్కడ వేపల సింగారంలోని తమ ఇంట్లో బంధువుల సమక్షంలో తల్లిదండ్రులు జయరాజు, జ్యోతి పెద్దఎత్తున వేడుక నిర్వహించారు. స్క్రీన్‌పై కనిపిస్తున్న తమ కుమార్తె, అల్లుడి వివాహ తంతును తిలకిస్తూ.. చేతుల్లో అక్షింతలు పట్టుకుని స్క్రీన్ మీదే చల్లి ఆశీర్వదించారు. వేల మైళ్ల దూరం ఉన్నా, వీడియో కాల్ ద్వారా జరిగిన ఈ అపూర్వ ఘట్టం అక్కడివారందరినీ భావోద్వేగానికి గురిచేసింది. పెళ్లి పందిరి అమెరికాలో వేసినా, అక్షింతలు మాత్రం ఇంటి నుంచే పడ్డాయి. కాలం మారుతున్న కొద్దీ సంప్రదాయాలను ఆచరించే పద్ధతులు మారుతున్నాయనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. విదేశాల్లో ఉన్న పిల్లలు, స్వదేశంలో ఉన్న పెద్దల మధ్య టెక్నాలజీ అనుసంధాన వేదికగా నిలిచిన ఈ అరుదైన పెళ్లి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వెయ్యి రోజుల పాలన.. ఫ్రీగా ఉల్లిగడ్డల పంపిణీ! వరంగల్‌లో కాంగ్రెస్ నేత వినూత్న సంబరాలు!

Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్‌? భారీగా తగ్గిన పసిడి ధర

బైక్‌పై ప్రేయసి కూర్చుంటే.. మేఘాలలో తేలిపోవడమే!

నేపాల్‌ వరదల్లో కొట్టుకుపోయిన ఇళ్లు.. యజమాని కుటుంబం కోసం ఎదురుచూస్తున్న శునకం

ఒకే ఒక్క పాట.. 5 కోట్ల వ్యూస్‌.. చివరికి సింగర్‌ ప్రాణాన్ని తీసేసింది ఇలా!

Loading...
Unable to load recommendations.
Follow Us