Viral Video: మేకప్‌ మాయాజాలం.. చూసే కళ్లను సైతం మోసం చేసే విచిత్రం..

Viral Video: మన చుట్టూ ఉన్న సమాజంలో ట్యాలెంట్‌ ఉన్న వారు ఎంతో మంది ఉన్నారు. తన అసమాన ప్రతిభతో ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. అయితే తమ ప్రతిభను ప్రపంచానికి తెలియజేసే సరైన వేదిక లభించక చాలా మంది మరుగున పడిపోతుంటారు....

Viral Video: మేకప్‌ మాయాజాలం.. చూసే కళ్లను సైతం మోసం చేసే విచిత్రం..

Updated on: May 19, 2022 | 1:34 PM

Viral Video: మన చుట్టూ ఉన్న సమాజంలో ట్యాలెంట్‌ ఉన్న వారు ఎంతో మంది ఉన్నారు. తన అసమాన ప్రతిభతో ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. అయితే తమ ప్రతిభను ప్రపంచానికి తెలియజేసే సరైన వేదిక లభించక చాలా మంది మరుగున పడిపోతుంటారు. ప్రతిభ ఉండి కూడా గుర్తింపునకు నోచుకోని వారు ఎంతో మంది. అయితే ఇదంతా ఒకప్పటి మాట కానీ ఇప్పుడు రోజులు మారాయి. సోషల్‌ మీడియా (social Media) విప్లవం తర్వాత ప్రతీ ఒక్కరికీ తమ ట్యాలెంట్‌ను బయట పెట్టే అవకాశం లభించింది. ప్రపంచంలోనే ఏ మూలన ఉన్నా సరే ఒక చిన్న వీడియో చేసి నెట్టింట పోస్ట్‌ చేస్తే సరి. క్షణాల్లో వీడియో ప్రపంచాన్ని చుట్టేస్తుంది. ఇలా సామాజిక మాధ్యమాల్లో రోజుకో కొత్త వీడియో వైరల్‌ అవుతోంది. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఓ ప్రొషెషనల్‌ మేకప్‌ ఆర్టిస్ట్ ప్రతిభకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోందీ వీడియో. ఈ వీడియో ప్లే అయ్యే కంటే ముందు ఉన్న ఫొటో చూడగానే ఓ యువతి తల బద్దలై మెదడు బయటకు కనిపిస్తున్న భావన నలుగుతుంది. తల పైభాగంలోని ఒక ముక్కను స్పూన్‌తో తీస్తున్నట్లు కనిపిస్తుంది. మొదట చూడగానే అది ఒక స్కెచ్‌లా కనిపిస్తుంది. అయితే ఓ చిన్న వీడియో క్లిప్‌ వల్ల దీని వెనకాల ఉన్న అసలు విషయం తెలుస్తుంది. అది స్కెచ్‌ కాదని, మేకప్‌ మాయజాలమని. అచ్చంగా తల పగిలిన భావన కలిగించేలా మేకప్‌ వేసిన తీరు ఆశ్చర్యానికి గురి చేయకమానదు. ప్రస్తుతం ఈ మేకప్‌ మాయజాలానికి సంబంధించిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వీడియోల కోసం క్లిక్ చేయండి..