Watch Video: నీలగిరిలో చిరుత దాడి.. ముగ్గురు ఫైర్ సిబ్బందికి గాయాలు

|

Nov 13, 2023 | 6:27 PM

తమిళనాడు నీలగిరి జిల్లా కున్నూర్‌ -టీ ఎస్టేట్ పరిధిలోని గ్రామాల్లో చిరుత హల్చల్‌ చేస్తుంది. ఓ ఇంట్లో దూరిన చిరుతను పట్టుకునే క్రమంలో ఫైర్ సిబ్బందిపై దాడి చేసింది. చిరుత దాడిలో ముగ్గురు ఫైర్ సిబ్బంది సహా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స కల్పిస్తున్నారు.

తమిళనాడు నీలగిరి జిల్లా కున్నూర్‌ -టీ ఎస్టేట్ పరిధిలోని గ్రామాల్లో చిరుత హల్చల్‌ చేస్తుంది. ఓ ఇంట్లో దూరిన చిరుతను పట్టుకునే క్రమంలో ఫైర్ సిబ్బందిపై దాడి చేసింది. చిరుత దాడిలో ముగ్గురు ఫైర్ సిబ్బంది సహా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స కల్పిస్తున్నారు. చిరుతని పట్టుకునేందుకు ఫైర్ సిబ్బంది ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు. సీసీ కెమెరాల్లో చిరుత కదలికలను గుర్తించారు. చిరుతను బంధించే వరకు అటవీ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. చిరుత దాడితో కున్నూర్‌ పరిసర ప్రాంతాల గిరిజనులు భయాందోళన చెందుతున్నారు.

దీపావళి పండుగ సందర్భంగా గ్రామాల్లో బాణసంచాలు పేల్చడంతో చిరుత భయంతో ఇళ్లలోకి చొరబడినట్లు భావిస్తున్నారు. గత 15 గంటలుగా అది ఇళ్లలోనే ఉండగా.. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.