
Black Panther Vs Leopard : స్వజాతి మధ్య వైరం ఎవరికైనా తప్పదేమో.. ఇటీవలే రెండు పాముల మధ్య మల్లయుద్ధం వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేయగా.. తాజాగా రెండు పులుల మధ్య ఓ చెట్టు మీద స్థానం కోసం జరిగిన పోరాటానికి చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అరుదుగా కనిపించే నల్ల చిరుత..( బ్లాక్ పాంథర్), చిరుత పులులకు చెట్టు మీద కూర్చొని ప్రకృతిని ఆస్వాదించడం చాలా ఇష్టం. పైగా ఎక్కువ ఎత్తులో కూర్చుంటే.. ఇతర జంతువులను గురిపెట్టి.. టార్గెట్ మిస్సవకుండా వేటాడటం వాటికి చాలా ఈజీ అవుతుంది. అందుకనే ఇవి ఎక్కువగా చెట్లమీదనే మకాం వేస్తాయి.
ఓ చిరుత ముందుగానే ఓ చెట్టెక్కి కూర్చుంది. తర్వాత దాని వెనుక వచ్చిన నల్ల చిరుత దాన్ని బెదరగొట్టి చెట్టును ఆక్రమించుకుకోవాలని ట్రై చేసింది. అయితే ఆల్రెడీ చెట్టుపైన ఉన్న చిరుత పెద్దగా గాండ్రించింది. ఆ అరుపు వినగానే నల్ల చిరుత బెదిరింది. ఈ వీడియోను ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు,ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్లను ఓ రేంజ్ లో ఆకర్షిస్తుంది. కర్ణాటకలోని ప్రసిద్ధ కబిని వన్యప్రాణుల అభయారణ్యానికి వెళ్ళినప్పుడు, చిరుతపులి మరియు నల్ల పాంథర్ మధ్య జరిగిన యుద్ధానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.
Also Read: సరికొత్త పద్ధతుల్లో టమాటాలు సేద్యం చేసి.. రోజుకి 7క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్న మహిళా రైతు..
దేత్తడి హారికకు భారీ షాక్.. టూరిజం అధికారిక వెబ్సైట్లో ఆమె నియామక వివరాలు తొలగింపు