Vizag: వెబ్‌సైట్లు,యూట్యూబ్‌లో సెర్చ్ చేసి అత్తను హత్య చేసిన కోడలు

Updated on: Nov 11, 2025 | 3:54 PM

విశాఖపట్నం వేపగుంట అప్పన్నపాలెంలో జరిగిన దారుణం వెలుగు చూసింది. అత్త జయంతి కనకమహాలక్ష్మిని చంపడానికి కోడలు లలిత వెబ్‌సైట్లు, యూట్యూబ్‌లో సెర్చ్ చేసి పథకం పన్నింది. దొంగ పోలీస్ ఆట పేరుతో ఆమెకు నిప్పంటించి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. తొలుత ప్రమాదంగా భావించినా, ఇప్పుడు హత్య కేసుగా నమోదు చేశారు.

విశాఖపట్నం వేపగుంట అప్పన్నపాలెంలో జరిగిన అమానుష ఘటనలో అత్త జయంతి కనకమహాలక్ష్మి అనుమానాస్పద స్థితిలో మరణించారు. పోలీసులు చేసిన దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలి కోడలు లలిత ఈ హత్యకు పాల్పడినట్లు తేలింది. వెబ్‌సైట్లు, యూట్యూబ్‌లో హత్య పద్ధతుల గురించి వెతికి, ఒక పథకం ప్రకారం ఈ నేరానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు.
లలిత దొంగ పోలీస్ ఆట ఆడుతున్నామని పిల్లలకు చెప్పి, తన అత్త కనకమహాలక్ష్మి కళ్లకు గంతలు కట్టి, కాళ్లు చేతులు కట్టేసింది. ఆ తర్వాత ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనను ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిరంజీవి రికార్డును బీట్ చేసిన చరణ్.. మొత్తానికి ఊపుమీదున్న తండ్రీకొడుకులు

Reliance Jio: జియో కీలక నిర్ణయం.. జెమినీ AI ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ

Rapido Fake App: ఫేక్‌ ర్యాపిడో యాప్‌తో క్యాబ్‌ డ్రైవర్‌ మోసం

చీకటిమయం కాబోతున్న భూమి.. కారణం అదేనంటున్న నాసా

రోడ్డు పక్కనే 2వేల నాటు కోళ్లు ప్రత్యక్షం.. పండగ చేసుకున్న స్థానికులు