సాధారణంగా జ్యూలరీ షాపుల్లో దొంగతనాలు జరుగుతుండటం చూసే ఉంటారు. తర్వాత కేసు నమోదు చేసి నిందితులను పోలీసులు పట్టుకోవడం జరుగుతూనే ఉంటుంది. కానీ ఓ జ్యువెలరీ షాపులో జరిగిన దొంగతనం గురించి తెలిస్తే ఆశ్చర్యపోక మానదు. సీసీటీవీ పరిశీలిస్తే కానీ అసలు దొంగతనం ఎలా జరిగిందనే తెలియలేదు. జ్యూలరీ షాపులో ఓ హారం దొంగతనం జరిగింది. కానీ మనుషులు మాత్రం ఆ హారాన్ని దొంగిలించలేదు. మరి మనుషులు కాకుండా మరెవరు దొంగతనం చేస్తారనేగా మీ అనుమానం. అసలు నెక్లెస్‌ను ఎత్తుకెళ్లింది ఎలుక. ఏంటి నమ్మాలనిపించడం లేదా..? ఇది నిజమేనండోయ్.. ఈ చోరీకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలోని కాసర్‌గడ్‌లోని ఓ ప్రముఖ నగల దుకాణంలో చోటు చేసుకుంది. ఓ ఎలుక ప్రముఖ బంగారు దుకాణ షాపులో చోరీకి పాల్పడింది. రోజులాగే రాత్రి జ్యూలరీ షాపును మూసివేసి ఇంటికి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం యజమాని షాపు తీసే సరికి డిస్‌ప్లేలో ఓ హారం కనిపించలేదు. కంగారు పడిన షాపు యజమాని షాపులో దొంగతనం జరిగిందని, దొంగలు హారాన్ని ఎత్తుకెళ్లారని షాపు సిబ్బంది సీసీటీవీ పుటేజీని పరిశీలించారు.
అందులో కనిపించిన దృశ్యం చూసి యజమాని సహా షాపు సిబ్బంది షాక్ అయ్యారు. వారి నోట మాట రాలేదు. నెక్లెస్ చోరీ అయిన విషయం వాస్తవమే. కానీ, దాన్ని ఎవరు ఎత్తుకెళ్లారో చూసి వారి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఓ ఎలుక ఖరీదైన నెక్లెన్ ను ఎత్తుకెళ్లినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది.
అర్థరాత్రి.. షాపు సీలింగ్ నుంచి ఓ ఎలుక బయటకు వచ్చింది. సరిగ్గా దాని కన్ను అక్కడే డిస్ ప్లే లో ఉంచిన బంగారు నెక్లప్ పై కన్నుపడింది. ఆ నెక్లెస్ పై దానికి ఎలాంటి మోజు కలిగిందో తెలియదు కానీ.. ఆ ఎలుక చేసిన చోరీ అందరిని ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ నగను చూసిన ఎలుక నోటితో పైకి ఎత్తుకెళ్లింది. ఇదంతా కూడా ఫుటేజీలో రికార్డ్ అయ్యింది. ఎలుక చేసిన పని చూసి అంతా షాక్ అయ్యారు. ఎలుక ఎంత పని చేసింది? అని తల పట్టుకున్నారు.
#अब ये चूहा डायमंड का नेकलेस किसके लिए ले गया होगा…. ?? pic.twitter.com/dkqOAG0erB
— Rajesh Hingankar IPS (@RajeshHinganka2) January 28, 2023
ఖరీదైన నెక్లెస్ ను ఎలుక ఎత్తుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. వాలెంటైన్స్ డే దగ్గర పడింది కదా.. ఆ ఎలుక తన లవర్ కి గిఫ్ట్ గా ఇచ్చేందుకు ఇలా నగను చోరీ చేసి ఉంటుందని ట్వీట్ చేస్తున్నారు నెటిజన్లు. 30 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రాజేష్ హింగాంకర్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి