తనిఖీల్లో భాగంగా కారును చెక్ చేసిన పోలీసులు.. డిక్కీ ఓపెన్ చేయగానే
దేశ రాజధాని ఢిల్లీలో కారు పేలుడు ఘటన తర్వాత పోలీసులు అప్రమత్తమయ్యారు. వాహనాల తనిఖీలో భాగంగా సిగ్నేచర్ బ్రిడ్జి వద్ద ఓ కారు డిక్కీలో ఓ వ్యక్తి హాయిగా నిద్రిస్తూ కనిపించాడు. స్థలం లేక డిక్కీలో పడుకున్నానని యువకుడు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
దేశ రాజధాని ఢిల్లీలో కారు పేలుడు సంఘటన సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ కారును ఆపి చెక్ చేశారు. ఆ కారు డిక్కీ ఓపెన్ చేసిన పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. ఆ కారు డిక్కీలో ఓ వ్యక్తి హాయిగా నిద్రపోతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు పేలిన ఘటన దేశవ్యాప్తంగా ఇది కలకలం రేపింది. ఈ సంఘటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలోని అన్ని చెక్‌పోస్టుల వద్ద భద్రతను పటిష్టం చేశారు. పలు చోట్ల వాహనాలను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా సిగ్నేచర్ బ్రిడ్జి చెక్‌పాయింట్ వద్ద తిమార్పూర్ పోలీసులు ఓ కారును ఆపారు. పెళ్లి వేడుక నుంచి తిరిగి వస్తున్న కుటుంబ సభ్యులు నవ్వుతూ ఆ కారు నుంచి కిందకు దిగారు. ఆ తర్వాత పోలీసులు ఆ కారు డిక్కీని ఓపెన్ చేయించారు. అందులో నిద్రిస్తున్న వ్యక్తిని చూసి వారు షాక్ అయ్యారు. అతడిని లేపి ఇక్కడెందుకు పడుకున్నావ్ అనిఅడిగితే.. కారులో ప్లేస్ లేదు.. నాకు నిద్రొస్తుంది మరి ఏంచేయను? అందుకే ఇక్కడ పడుకున్నా అంటూ యువకుడు సమాధానం చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఆ యువకుడు చెప్పింది నిజమేనని బంధువులు చెప్పడంతో పోలీసులు వారిని హెచ్చరించి వదిలేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Whatsapp Call: కొంపముంచిన వాట్సాప్ కాల్.. ఏం జరిగిందంటే ??
Good News For Farmers : రైతులకు తీపికబురు.. నాలుగు రోజుల్లో
పోలీసులకే సవాల్ విసిరి.. చివరికి ఇలా
