వీడు మామూలోడు కాదు.. పాముకే డ్యాన్స్‌ నేర్పాడుగా

Updated on: Sep 02, 2025 | 6:31 PM

దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. విద్యుత్ దీపాలంకరణలతో, రకరకరాల ఆకృతులలో వాడవాడలా గణపతి కొలువుదీరి పూజలందుకుంటున్నారు. భక్తుల భజనలు, డ్యాన్సులు, కోలాటాలతో పందిళ్లలో సందడి నెలకొంది. ఈ క్రమంలో కొందరు మందుబాబులు కూడా మండపాలవద్ద చేరి డ్యాన్సులతో రచ్చ చేస్తున్నారు.

ఓ వ్యక్తి గణపతి మండపం వద్ద ఏకంగా పాముతో డ్యాన్స్‌ చేయించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఓ గణపతి మండపం వద్ద మందుబాబు హల్‌చల్‌ చేశాడు. మండపం వద్దకు పాము ఎక్కడినుంచి వచ్చిందో కానీ ఈ మందుబాబు కంటిలో పడింది. దాన్ని చూడగానే మనోడు రెచ్చిపోయాడు. పామును ఎటూ వెళ్లనివ్వకుండా అడ్డుకుంటూ దానిముందు మోకాళ్లమీద కూర్చుని నాగినీ డ్యాన్స్‌ చేయడం మొదలుపెట్టాడు. ఆ పామును కూడా చెయ్యమన్నట్టుగా దానిని రెచ్చ గొట్టాడు. చేతులతో నాదస్వరం ఊదుతున్నట్టుగా దానిముందు యాక్ట్‌ చేస్తూ ఓ రేంజ్‌లో డ్యాన్స్‌ చేశాడు. పాపం అతనితో పోటీపడి డ్యాన్స్‌ చెయ్యలేక, తప్పించుకుని పోలేక నానా అవస్థలు పడింది పాము. ఆ మందుబాబు మాత్రం డ్యాన్స్‌ ఆపలేదు.. పామును ముందుకి పోనివ్వలేదు. దీంతో పాము నిస్సహాయంగా ఉండిపోయింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేశారు. “ఒరేయ్ చారీ, నిజమైన నాగినీ డ్యాన్స్ అంటే ఇదేరా” అని ఒకరు, “ఒరేయ్ ఆడికి ఎవడైన చెప్పండ్రా.. పోని ఎవరికైనా చూపించండ్రా” అంటూ మరో నెటిజన్‌ కామెంట్లు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రేమించిన యువతితో పెళ్లి కోసం సెల్ టవర్ ఎక్కిన యువకుడు.. ఆ తర్వాత

A. R. Rahman: ఇలాంటి మూవీకి పనిచేయడం ప్రతి సంగీత దర్శకుడి కల

LPG Price: గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

ఖాతాదారుల బంగారాన్ని స్వాహా చేసిన బ్యాంక్‌ మేనేజర్‌,క్యాషియర్‌

బయటి నుంచి వచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకున్న వ్యక్తి.. కాసేపటికే నురగలు కక్కుతూ