ఇంతలో ఆక్కడికి ఓ ఎద్దు వచ్చింది. బస్సు ఫుట్‌బోర్డ్ దగ్గర నిలబడి లోపలికి చూసింది. సాధారణంగా బస్సులోని వారు ఏదైనా ఆహారం పెడతారేమోనని ఇలా రోడ్లపైన తిరిగే ఆవులు, ఎద్దులు బస్సుల దగ్గరకు వచ్చి నిల్చుంటాయి. ఈ బస్సులోని ప్రయాణికులు మొబైల్స్ చూడ్డంలో లీనమైపోవడంతో ఎద్దును గమనించలేదు. ఎంతకీ ఎవరూ ఏమీ పెట్టకపోవడంతో ఆ ఎద్దు మనమే లోపలికి వెళ్లి వెతుక్కుందామనుకున్నట్టుంది. వెంటనే బస్సులోపలికి ఎక్కింది. బస్సులో ఒక్కసారిగా ఎద్దును చూసిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఎద్దు ఎక్కడ తమ మీదకు దూకేస్తుందో అనే భయంతో అంతా అటూ, ఇటూ పరుగులు తీశారు. డ్రైవర్ తన సీటు డోర్ ఓపెన్ చేసుకొని దూకేశాడు. అతనితోపాటు కొందరు ప్రయాణికులు కూడా అద్దాలు పగలగొట్టుకొని బయటకు దూకేశారు. బస్సులో ఎద్దు అటూ ఇటూ తిరగడంతో అద్దాలు ధ్వంసం అయ్యాయి.