అప్పర్ బెర్త్ ఎక్కి.. స్నాక్ కొట్టేస్తున్న చిల్లర దొంగ
ప్రయాణం కోసం రైలు బెర్త్ బుక్ చేసుకున్నాడు ఒక యువకుడు. అప్పర్ బెర్త్ రావటంతో చక్కగా ఎక్కి కూర్చొన్నాడు. అయితే, ఆ తర్వాత ఆ బెర్త్ మీది నుంచి తాను చేసే పనిని ఎవరూ చూడలేదనుకుని.. ఓ కక్కుర్తి పనికి పాల్పడ్డాడు.అయితే, అదే బోగోలో దూరం నుంచి మరొక ప్రయాణికుడు.. ఇతగాడి చేష్టలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
దీంతో ఆ యువకుడి తీరుకు నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రైల్లోని ఓ రిజర్వేషన్ బోగీ నిండుగా ఉంది. రైలు బోగీలోంచి.. చిరువ్యాపారులు అటూ ఇటూ తిరుగుతూ ప్రయాణికులకు అవసరమైన ఆహార పదార్ధాలు అమ్ముతున్నారు. మొదట ఓవ్యక్తి తన నెత్తిపైన ఓ బస్తాలో జ్యూస్ ప్యాకెట్లు పెట్టుకొని అమ్ముకుంటూ కనిపించాడు. అలా వచ్చిన ఆ వ్యాపారితో అప్పర్‌బెర్త్‌లో కూర్చున్న యువకుడు మాటలు కలిపాడు. కాసేపటికి ఆ వ్యాపారి అక్కడి నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో కిందపెట్టిన బస్తాను నెత్తిన పెట్టుకున్నాడు. అంతే.. ఆ యువకుడు అప్పర్ బెర్త్ నుంచి ముందుకు వంగి చిటికెలో బస్తా నుంచి ఒక జ్యూస్ ప్యాకెట్ కొట్టేశాడు. ఈ విషయం తెలియక ఆ వ్యాపారి ముందుకెళ్లిపోయాడు. ఆ తర్వాత సమోసా వ్యాపారి బుట్టలోంచి సమోసా కొట్టేసాడు. ఆ తర్వాత వాటర్ బాటిల్ వ్యాపారి బాస్కెట్ నుంచి ఒక సీసా కొట్టేశాడు. ఇలా.. ఆ బోగీలోకి వచ్చిన ప్రతి ఒక్క వ్యాపారి నుంచి ఏదో ఒకటి కొట్టేస్తూనే వచ్చాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘ఛీ.. చిల్లర బుద్ధులు’ అని తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు ఇలాంటి వారిని గట్టిగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిల్డింగ్ లిఫ్ట్‌లో గలీజ్ పని చేసిన డెలివరీ బాయ్.కేసు నమోదు
మనిషి దంతాల వింత చేప.. పట్టుకుంటే అంతే
కొలను తవ్వుతుండగా అద్భుతం.. షాకైన గ్రామస్తులు..!
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

