3 కళ్లజోడు గుర్తులతో అరుదైన నాగుపామును చూశారా?
అరుదైన నాగుపాము ఒకటి చెన్నైలో కనిపించింది. ఈ కోబ్రా శరీరంపైన ఒకటి, రెండు కాదు.. మూడు కళ్లజోడు గుర్తులున్నాయి. ఈ ప్రత్యేకమైన పామును చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అది మామూలు పాము కాదు అంటున్నారు జంతు శాస్త్రవేత్తలు. చెన్నైలోని తారామణి పాలిటెక్నిక్ కాలేజ్ క్యాంపస్‌లో మూడు కళ్లజోళ్ల గుర్తులతో అరుదైన స్పెక్టకిల్డ్ నాగుపాము కనిపించింది.
వింతగా ఉన్న ఈ పామును చెన్నై వన్యప్రాణుల విభాగం సురక్షితంగా తన అధీనంలోకి తీసుకుంది. ఈ అరుదైన కింగ్ కోబ్రా కనిపించడం తమకు ఆశ్చర్యంగా ఉందని సిబ్బంది తెలిపారు. సాధారణంగా భారతీయ కోబ్రా మీద కనిపించే గుర్తులు ఈ నాగుపాము శరీరం మీద ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. నాగుపాము గురించి హెర్పటాలజిస్ట్ ఏం చెప్పారంటే.. ఇలాంటి గుర్తులతో కూడిన పాము కనిపించడం చాలా అరుదుగా జరుగుతుందని చెప్పారు. ఇండియన్ రాక్ పైథాన్, రస్సెల్స్ వైపర్ల శరీరాలపై విలక్షణమైన మచ్చలు ఉన్నా, బైనోసెల్లేట్ నమూనా కోబ్రాలు ప్రత్యేకమైనవని అన్నారు. ఈ మచ్చలు సాధారణంగా వాటి హుడ్‌కే పరిమితమవుతాయని అయితే ఇక్కడ శరీరంపై కనిపించడం అసాధారణమని అన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Saudi Arabia: సౌదీలో ఆ పని చేస్తే.. ఉరిశిక్షే..!
తేరగా దొరికిందని రూ. 40 కోట్ల భూమిపై కన్నేశారు.. కట్ చేస్తే
Kohinoor: కోహినూర్ పుట్టింది ఎక్కడ ?? అది బ్రిటిషర్ల చేతికి ఎలా చిక్కింది ??
నా కూతరు మెంటల్ డిజార్డర్‌తో బాధపడుతోంది! అసలు నిజం బయటపెట్టిన కల్పిక తండ్రి
Ghaati: దిక్కులేకుండా ఘాటి ?? ఈ తొందరపాటు నిర్ణయాలు ఎందుకు ??
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

