మనిషి దంతాల వింత చేప.. పట్టుకుంటే అంతే
చేపలకు ముళ్లుంటాయి.. మొప్పలుంటాయి.. దంతాలూ ఉంటాయి. అయితే, కొన్ని చేపలకు అచ్చం.. మనిషి దంతాల వంటి పళ్లుంటాయి. అవును. ఇది ముమ్మాటికీ నిజం.రూప్‌చంద్ అనే రకం చేప కింది దవడ దంతాలు..అచ్చం మనిషి కింది దవడ దంతాల్లాగే ఉంటాయి.అలాంటి ఓ చేప ప్రస్తుతం పశ్చిమ గోదావరి జాలర్ల వలకు చిక్కింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పలు చోట్ల ఈ చేపల పెంపకం సాగుతోంది.
ఫిరానా చేపల జాతికి చెందిన ఈ చేపలతో మహా జాగ్రత్తగా ఉండాలంటున్నారు.. నిపుణులు. ఇక రూప్ చంద్ చేపల విషయానికి వస్తే.. ఇవి ఎక్కువగా మాంసాహారాన్ని ఇష్టపడతాయి. ఇవి పిరానా జాతికి చెందినవి. ఈ రకం చేపలు గోదావరి జిల్లాల నుంచి ఎక్కువగా బెంగాల్‌కు ఎగుమతి అవుతున్నాయి. బెంగాలీలు వీటిని ఇష్టంగా తింటారు. ప్రోటీన్ ఎక్కువగానూ.. కొవ్వు తక్కువగానూ ఉండటంతో.. వీటిని బరువు తగ్గాలనుకునేవారు ఆహారంగా తీసుకుంటారు. ఈ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండటంతో గుండె ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. ఇవి కేజీ నుంచి 3 కేజీల బరువు వరకు పెరుగుతాయి.ఈ చేపలు కొన్ని ఎరుపు, తెలుపు నలుపు సిల్వర్ రంగులలో ఉంటాయి. ఇది చెరువులోనూ నదులలోను పెరుగుతాయి. సిల్వర్ రంగు చేపలు ఉప్పునీటిలో సైతం పెరుగుతాయి. ఎకరం చెరువులో సుమారు 4 వేల నుంచి 5 వల వరకు రూప్ చంద్ చేప పిల్లలను పెంచుతారు. ఎకరానికి నాలుగు టన్నులపైనే దిగుబడి వస్తుంది.తర్వాత వీటిని ఎగుమతి చేస్తారు. తమ బలమైన దంతాలతో మనుషుల చేతులు, కాళ్లను తీవ్రంగా గాయపరిచే ప్రమాదం ఉండటంతో వీటిని పట్టుకునే సమయంలో చెరువుల్లో దిగే కూలీలు చాలా జాగ్రత్తగా ఉంటారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొలను తవ్వుతుండగా అద్భుతం.. షాకైన గ్రామస్తులు..!
శ్రావణమాసంలో అద్భుతం..! శివుడి మెడలో నాగుపాము
3 కళ్లజోడు గుర్తులతో అరుదైన నాగుపామును చూశారా?
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

