జాతి వైరం మరిచి.. తల్లి ప్రేమను పంచి.. మానవత్వానికి మూగజీవాల పాఠం
ప్రస్తుతం బంధాలు కనుమరుగవుతున్న కాలంలో, మూగజీవాలు మానవత్వాన్ని గుర్తుచేస్తున్నాయి. పెద్దపల్లిలో జరిగిన ఈ అద్భుత ఘటనలో, ఒక కోతి తల్లిలేని కుక్కపిల్లను తన బిడ్డలా దగ్గరకు తీసుకుని, లాలించింది. జాతి వైరాన్ని మరిచి ఆ వానరం చూపిన ప్రేమ, ఆప్యాయత చూపించిన ఈ దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది మనుషులకు ఒక గొప్ప మానవత్వపు పాఠం. ఈ వైరల్ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు కనుమరుగవుతున్న ప్రస్తుత కాలంలో, మనుషులు మరిచిపోయిన మానవత్వాన్ని మూగజీవాలు గుర్తుచేస్తున్నాయి. అందుకు ఉదాహరణే ఈ ఘటన. జాతి వైరాన్ని మరిచి ఒక కోతి, కుక్కపిల్లపై చూపిన ప్రేమ అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాక, ఆలోచింపజేస్తోంది. ఈ అరుదైన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని హనుమాన్ నగర్‌లో చోటుచేసుకుంది. తల్లికి దూరమై, ఎండవేడిమికి తట్టుకోలేక ఒక చిన్న కుక్కపిల్ల నీడ కోసం అలమటిస్తూ ఒక చెట్టు వద్దకు చేరింది. ఆ పసికూన అవస్థను చెట్టుపై నుండి గమనించిన ఒక వానరం, మెల్లగా కిందకు దిగివచ్చింది. సాధారణంగా కోతులు, కుక్కల మధ్య ఉండే వైరానికి భిన్నంగా.. ఆ వానరం కుక్కపిల్లను ఎంతో ప్రేమతో దగ్గరకు తీసుకుంది. తన బిడ్డలాగే అక్కున చేర్చుకుని, నిమురుతూ లాలించింది. ఆ కుక్కపిల్ల కూడా భయం లేకుండా వానరం ఒడిలో తలదాచుకుని సేదతీరడం అక్కడ ఉన్నవారిని మంత్రముగ్ధులను చేసింది. అదుదైన ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు మూగజీవాల మధ్య ఉన్న ఆప్యాయతకు మురిసిపోయారు. జాతివైరం మరిచి, కుక్కపిల్లపై వానరం చూపిన ఆదరణ మనుషులకు ఒక గొప్ప పాఠం అని స్థానికులు కొనియాడారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెచ్చిపోయిన రోడ్‌సైడ్ రోమియోలు..
దేవుడు నాకిలా రాసిపెట్టాడేమో.. పవన్ ఎమోషనల్ వీడియో..
చివరికి గట్టెలపొయ్యే గతైంది !! నాగ శౌర్య తల్లి హోటల్ పరిస్థితి ఇది
Ram Charan: ముగ్గురు రిజెక్ట్ చేస్తే కానీ.. చరణ్ దగ్గరకు రాలేదు
Prathyusha Case: 24ఏళ్ల తర్వాత బయటికొచ్చి.. కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ్ రెడ్డి
