Vietnam Scam: కిలాడీ లేడీ.. రూ.లక్ష కోట్ల మోసం.! లబోదిబోమంటున్న వేలాది బాధితులు.

|

Feb 04, 2024 | 8:58 AM

వియత్నాం దేశాన్ని భారీ కుంభకోణం కుదిపేస్తోంది. రియల్ ఎస్టేట్‌ వ్యాపార దిగ్గజంగా పేరున్న మహిళ ఏకంగా లక్ష కోట్ల రూపాయల ప్రజల సొమ్మును కాజేసింది. దీంతో ఆమె వల్ల బాధితులైన వేలాదిమంది లబోదిబోమంటున్నారు. వియత్నాంలోని ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్‌ వాన్‌ తిన్హ్‌ పాట్‌ అనే కంపెనీ ఛైర్‌పర్సన్‌ ట్రుయాంగ్‌ మైలాన్‌కు స్థానిక సైగాన్‌ కమర్షియల్‌ బ్యాంకులో దాదాపు 90 శాతం వాటా ఉంది. గత కొన్నేళ్లుగా ఈ బ్యాంకులో ఆమె మోసాలకు పాల్పడ్డారు.

వియత్నాం దేశాన్ని భారీ కుంభకోణం కుదిపేస్తోంది. రియల్ ఎస్టేట్‌ వ్యాపార దిగ్గజంగా పేరున్న మహిళ ఏకంగా లక్ష కోట్ల రూపాయల ప్రజల సొమ్మును కాజేసింది. దీంతో ఆమె వల్ల బాధితులైన వేలాదిమంది లబోదిబోమంటున్నారు. వియత్నాంలోని ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్‌ వాన్‌ తిన్హ్‌ పాట్‌ అనే కంపెనీ ఛైర్‌పర్సన్‌ ట్రుయాంగ్‌ మైలాన్‌కు స్థానిక సైగాన్‌ కమర్షియల్‌ బ్యాంకులో దాదాపు 90 శాతం వాటా ఉంది. గత కొన్నేళ్లుగా ఈ బ్యాంకులో ఆమె మోసాలకు పాల్పడ్డారు. నకిలీ రుణ దరఖాస్తులు పెట్టి కోట్ల రూపాయల మేర డబ్బులు తీసుకున్నారు. వాటిని తిరిగి చెల్లించకపోవడంతో ఆ బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో అందులో డబ్బులు దాచుకున్న దాదాపు 42 వేల మంది సామాన్యులపై ఈ ప్రభావం పడింది. 2018 నుంచి 2022 మధ్య లాన్‌.. ఇలా 916 నకిలీ దరఖాస్తులు సృష్టించి బ్యాంకు నుంచి వియత్నాం కరెన్సీ 304 ట్రిలియన్‌ డాంగ్‌లు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మొత్తం 12.5 బిలియన్‌ డాలర్లకు పైమాటే. 2022లో ఈ కుంభకోణం బయటపడగా ఆ ఏడాది అక్టోబరులో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. నాటి నుంచి బ్యాంకు డబ్బు స్తంభించిపోయి, వందలాది బాధితులు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఈ కుంభకోణంలో లాన్‌తోపాటు 85 మందిపై కేసు నమోదైంది. ఇందులో బ్యాంకు మాజీ ఎగ్జిక్యూటివ్‌లు, ప్రభుత్వ మాజీ అధికారులు కూడా ఉన్నారు. లాన్‌ సంపద విలువ 2022 నాటికి దేశ జీడీపీలో 3 శాతం ఉంటుందని అంచనా.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos