పొంగిపొర్లుతున్న వాగు..ఒడ్డు చివర పెళ్లికొడుకు.. ఇంతలో వీడియో

Updated on: Aug 16, 2025 | 8:00 PM

పెళ్లి వేడుకకు అన్ని సిద్ధం చేశారు. పెళ్లి కూతురు ముస్తాబై కూర్చుంది.. అయ్యగారు సిద్ధంగా ఉన్నారు.. కానీ.. వరుడు ఇంకా రావడం లేదు. వెళ్లి చూసేసరికి ఊరి శివారులోని వాగు ఉధృతంగా పొంగిపొర్లుతోంది. ఒడ్డు చివర పెళ్లికొడుకు వాగు దాటలేక నిలబడిపోయాడు. చుట్టుపక్కల వాళ్లు ఇప్పుడు దాటొద్దు.. ప్రమాదం అంటూ హెచ్చరిస్తున్నారు. కానీ ముహూర్తం దగ్గరపడుతోంది. దీంతో పెళ్లికొడుకు.. పెళ్లి సమయం దగ్గరపడుతుందని.. వెళ్లి తీరాలంటూ ముందుకు అడుగులు వేశాడు.

పక్కనే ఉన్నవారంతా ఇక చేసేదేం లేక ప్లాన్ మార్చేశారు. ఒక్కసారిగా ఎవరో పెళ్లి కొడుకును భుజాన ఎత్తుకుంటే, ఇంకొందరు చుట్టూ కాపలాగా.. ఉప్పొంగుతున్న వాగు నీటిలో నుంచి ఒక్కొక్క అడుగు ముందుకు కదిలారు. చుట్టూ వర్షపు శబ్దం, నీటి మోత, బంధువుల హోరు కేకలు.. అన్నీ కలిసిపోయి సినిమా క్లైమాక్స్ సీన్‌లా మారిపోయింది.కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో పెళ్లి వేడుకను కాసేపు వరద అడ్డుకుంది. జగిత్యాల జిల్లా గుంజపడుగు గ్రామానికి చెందిన కొముర మల్లుకు, గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన టేకు భాగ్యకు వివాహం నిశ్చయమైంది. బుధవారం ఆగస్టు 13 ముహూర్తం నిర్ణయించారు. పెళ్లి వేడుక కోసం వరుడి తరుపున బంధువులు, గ్రామస్తులు వివిధ వాహనాల్లో వెంకట్రావుపల్లి, పొత్తూరు మీదుగా గన్నేరువరం సమీప వరకు చేరుకున్నారు. ఈలోపు ఎగువ ప్రాంతాల నుంచి నీరు భారీగా వస్తోంది. గ్రామాల్లోకి వెళ్లాలంటే రోడ్డుపై నుంచి భారీగా వరద పారుతోంది. మరింత వరద నీరు పొంగిపొర్లుతుండడంతో గ్రామంలోకి వెళ్లడం కష్టంగా మారింది. వరుడు ఊర చెరువు వరకు చేరుకున్నాడు. కానీ.. వరద ఉదృతి తగ్గడం లేదు. నాలుగు గంటల పాటు ఎదురు చూశాడు. కానీ.. వరద శాంతించలేదు. ఇక లాభం లేదని, స్థానికులు వరుడిని ఎత్తుకుని వాగును దాటించారు. నాలుగు గంటల తరువాత.. అంతా కలిసి వధువు ఇంటికి చేరుకున్నారు. నాలుగు గంటల ఆలస్యంతో పెళ్లి వేడుక మొదలైంది. వరుడు తల్లిదండ్రుల ను కూడా మెల్లగా వరద దాటించారు.

మరిన్ని వీడియోల కోసం :

ఐశ్వర్యారాయ్‌ 17 ఏళ్లుగా రాఖీ కడుతున్న ఆ స్టార్‌ యాక్టర్‌ ఎవరో తెలుసా?

కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో వరుడు జంప్ వీడియో

సింహానికి ఎదురెళ్లిన మనిషి.. చివరికి.. వీడియో

ఆ సమయంలో మహిళలకు ఎందుకు ఎక్కువగా జుట్టు రాలిపోతుందో తెలుసా?