AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే బాత్రూమ్‌కి వెళ్లి.. డోర్‌ ఓపెన్‌ చేయగానే వీడియో

ఉదయాన్నే బాత్రూమ్‌కి వెళ్లి.. డోర్‌ ఓపెన్‌ చేయగానే వీడియో

Samatha J
|

Updated on: Aug 16, 2025 | 8:00 PM

Share

బంగాళాఖాతంలో అల్పపీడనం..ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద ఉధృతికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వనాల్లో ఉండాల్సిన పాములు వాటి ఆవాసాలు కోల్పోయి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇళ్లు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలో జనావాసాల్లోకి వచ్చిన ఓ భారీ కింగ్‌ కోబ్రా జనాలను పరుగులు పెట్టించింది.

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం కిచ్చాడ గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తి … తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకునే క్రమంలో భాగంగా ఇంటి ఆవరణలోని స్నానాలగది వద్దకు వెళ్లి బయటి నుంచి లైట్ వేసి.. తలుపు తీశాడు. అంతే..ఏవో శబ్దాలు వినిపించాయి. ఏమై ఉంటుందా అని మెల్లగా డోర్‌ ఓపెన్‌ చేసి చూసేసరికి ఓ పెద్ద కింగ్ కోబ్రా బుసలు కొడుతూ పడగ విప్పి కనిపించింది. దీంతో భయంతో వణికిపోయిన శివ.. వెంటనే కేకలు వేస్తూ.. ఇంట్లోకి పరుగుతీశాడు. దీంతో, కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు అక్కడకు చేరి.. ఆ నాగుపామును చూసి షాకయ్యారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.వారు స్నేక్ క్యాచర్ పిలిచి కింగ్ కోబ్రాను పట్టుకోవాలని సూచించారు. అయితే, ఆ కోబ్రా ఒక పట్టాన అతను పామును బంధించే క్రమంలో కింగ్‌ కోబ్రా అతనిపై దాడికి యత్నిస్తూ ముప్పు తిప్పలు పెట్టింది. పాము సంగతి తెలిసి ఊరూవాడా అక్కడకు చేరటంతో .. ఆ ప్రాంతమంతా అలజడిగా మారింది. జనం కేకలు, అలజడితో బెదిరిపోయిన పాము ఒక దశలో జనాలపై దాడికి యత్నించటంతో అక్కడివారంతా తలోదిక్కూ పరుగులు పెట్టారు. అయితే, స్నేక్‌ క్యాచర్‌చాకచక్యంగా కోబ్రా ను బంధించి సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.వానాకాలం మొదలైన నాటి నుంచి తమ ప్రాంతంలో ఎన్నో పాములు కనిపించాయని, చీకటి పడితే కాలుబయట పెట్టలేకపోతున్నామని స్థానికులు వాపోయారు. అయితే, స్థానికులు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇళ్లు చుట్టూ చెత్తాచెదారం లేకుండా, పొదలు పెరగనీయకుండా చూడాలని అధికారులు సూచిస్తున్నారు. పాములు కనిపిస్తే వాటిని చంపకుండా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు స్నేక్‌ క్యాచర్‌, అటవీశాఖ అధికారులు .

మరిన్ని వీడియోల కోసం :

ఐశ్వర్యారాయ్‌ 17 ఏళ్లుగా రాఖీ కడుతున్న ఆ స్టార్‌ యాక్టర్‌ ఎవరో తెలుసా?

కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో వరుడు జంప్ వీడియో

సింహానికి ఎదురెళ్లిన మనిషి.. చివరికి.. వీడియో

ఆ సమయంలో మహిళలకు ఎందుకు ఎక్కువగా జుట్టు రాలిపోతుందో తెలుసా?