Mahendra Bolero: రైలు పట్టాలెక్కిన మహేంద్ర బొలెరో..! ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనపై..

Updated on: Apr 03, 2023 | 9:06 AM

మహీంద్రా బొలెరో రైలు పట్టాలెక్కింది. రోడ్డుపై ప్రయాణించాల్సిన వాహనం.. రైలు పట్టాలపై సునాయసంగా పరుగులు పెట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

మహీంద్రా బొలెరో రైలు పట్టాలెక్కింది. రోడ్డుపై ప్రయాణించాల్సిన వాహనం.. రైలు పట్టాలపై సునాయసంగా పరుగులు పెట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జి దగ్గర ఈ అరుదైన దృశ్యం కనిపించింది. ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన ఈ బ్రిడ్జిని జమ్మూ కాశ్మీర్ లోని చీనాబ్ వద్ద నిర్మిస్తోంది కేంద్ర సర్కార్. అందులో భాగంగానే రైలు పట్టాలపై నడిచేందుకు అనుకూలంగా ఓ మహేంద్ర బొలెరో వాహనాన్ని తీర్చిదిద్దారు. దానిని పట్టాలపై ఎక్కించి పరుగులు పెట్టించారు. దీన్ని వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోను చూసి మహీంద్రా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఆశ్చర్యపోయారు. ఈ వీడియోను రాజేందర్ బి అక్లేకర్ అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు. దీనికి అనంద్ మహీంద్రాను కూడా ట్యాగ్ చేశారు. దీంతో ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ ఆ పోస్ట్ ను రీట్వీట్ చేశారు. అందులో బొలెరో సామర్థ్యం కొత్త ఎత్తులకు చేరుతోందని అన్నారు. స్వతంత్ర భారతదేశంలో మహీంద్రా వ్యవస్థాపకులు రహదారి లేని చోటికి వెళ్లేలా వాటిని తయారు చేశారన్నారు. ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తికి థ్యాంక్స్ చెబుతూ.. వీటిని ఎప్పటికీ తన వద్దనే భద్రపర్చుకుంటానని పేర్కొన్నారు. ఇదిలావుంటే ప్రపంచంలోనే ఎత్తైన ఈ రైల్వే బ్రిడ్జికి ‘చీనాబ్ బ్రిడ్జి’ ‌గా నామకరణం చేశారు. ఇది చీనాబ్ నది నీటి మట్టం కంటే 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ వంతెన మొత్తం పొడవు 1315 మీటర్లు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..

Published on: Apr 03, 2023 09:05 AM