బైక్‌పై ఎలుగుబంటి సరదా సరదాగా షికారు.. వీడియో నెట్టింట ఫుల్ వైరల్
మనుషులు రోజంతా పనిచేసి అలసిపోతుంటారు. ఆ అలసటను తొలగించుకొని రీ ఫ్రెష్ అవడానికి సాయంత్రం వేళ ఆరుబయటకు వెళ్తుంటారు. పార్కులకో, రైడ్‌కో వెళ్తుంటారు. ఇది మనుషులకే కాదండోయ్.. జంతువులు కూడా అలసిపోతుంటాయి. అవి ఎలాగూ ఆరుబయటే ఉంటాయి కాబట్టి ఈజీగానే రిలాక్స్ అవుతాయి. మరి సర్కస్‌లు, జూల్లో ఉండే వాటి పరిస్థితి ఏంటి? సందర్శకులను చూసి చూసి జూలో ఉన్నవి బోర్ ఫీలయితే.. సర్కస్ చేసీ చేసీ ఇక్కడి జంతువులు అలసిపోతుంటాయి.
మనుషులు రోజంతా పనిచేసి అలసిపోతుంటారు. ఆ అలసటను తొలగించుకొని రీ ఫ్రెష్ అవడానికి సాయంత్రం వేళ ఆరుబయటకు వెళ్తుంటారు. పార్కులకో, రైడ్‌కో వెళ్తుంటారు. ఇది మనుషులకే కాదండోయ్.. జంతువులు కూడా అలసిపోతుంటాయి. అవి ఎలాగూ ఆరుబయటే ఉంటాయి కాబట్టి ఈజీగానే రిలాక్స్ అవుతాయి. మరి సర్కస్‌లు, జూల్లో ఉండే వాటి పరిస్థితి ఏంటి? సందర్శకులను చూసి చూసి జూలో ఉన్నవి బోర్ ఫీలయితే.. సర్కస్ చేసీ చేసీ ఇక్కడి జంతువులు అలసిపోతుంటాయి. అందుకే అవికూడా అప్పుడప్పుడూ రిలాక్స్ అవ్వాలనుకుంటాయి. అలా అలసిపోయిన ఓ ఎలుగుబంటి బైక్‌పై ఊరిలో షికారుకి వెళ్లింది. అలా వెళ్తూ వెళ్తూ రోడ్డుపై కనిపించిన వారందరికీ తన ముందరి కాళ్లతో హాయ్ చెబుతూ విష్ చేసింది కూడా. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. రష్యాలోని ఆర్కెంగెలిస్క్ ప్రాంత వీధుల్లో ఓ ఎలుగుబంటి సరదాగా బైక్ పై షికారుకెళ్లింది! కారులో వెళ్తున్న ఓ వ్యక్తి ఈ వీడియోను చిత్రీకరించాడు. అయితే ఇది పాత వీడియోనే అయినప్పటికీ మరోసారి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మళ్లీ వైరల్ అవుతోంది. యూపీఐ న్యూస్ కథనం ప్రకారం.. ఆ వీడియోలోని ఎలుగుబంటి పేరు టిమ్. ఓ సర్కస్ కంపెనీలో పనిచేస్తోంది! అలసటకు గురైనప్పుడల్లా ఎలుగుబంటి ట్రైనర్ దాన్ని బైక్ కు అతికించిన సైడ్ కార్ లో కూర్చోబెట్టుకొని ఇలా వీధుల్లో తిప్పుతాడట. అయితే ఇందులో భయపడాల్సిందేమీ లేదని సర్కస్ నిర్వాహకుడు ఒకరు తెలిపారు. స్థానికుల భద్రతపై అధికారులతో సమన్వయం చేసుకున్నాకే టిమ్ ను అప్పుడప్పుడూ అలా బయట తిప్పుతుంటామని వివరించారు. తాజాగా ఈ వీడియోను పోస్ట్ చేసిన కొన్ని గంటలలోనే దీనికి ఏకంగా ఒక కోటీ 10 లక్షల మంది వీక్షించారు. ఎలుగుబంటి బైక్ షికారును చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
100 రోజులు.. 200 విమానాల్లో దొంగ జర్నీ.. చివరికి ??
Nasa: చంద్రుడిపై రైళ్లను పరుగెత్తించనున్న నాసా !!
Weather Report: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ సారి నైరుతి ముందే వస్తోంది..
మెట్రోను ఇలా ఎక్కితేనే ప్రశాంతం.. వీడియో చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు