చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో
గంపెడాశతో సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. ఒక భారీ చేప కనిపించటంతో దానికి గాలం వేశారు. అది గాలానికి చిక్కుకోవటంతో.. ‘ఈ రోజు మన పంట పండిందిలే..’ అనుకుంటూ దాన్ని నెమ్మదిగా బూటులోకి లాగుతున్నారు. అంతే.. ఊహించని రీతిలో ఆ చేప బలంగా ఆ గాలాన్ని, దాన్ని పట్టుకున్న జాలరిని సముద్రంలోకి లాక్కుపోయింది.ఊహించని ఈ పరిణామానికి బోటులో ఉన్న మిగతా మత్స్యకారులు షాకై సముద్రంలో గాలింపు చేపట్టారు. కానీ, ఎక్కడా అతడి జాడ లేకపోవటంతో గల్లంతయిన మత్స్యకారుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ ఘటన అనకాపల్లి జిల్లా అచ్చుతాపురంలో జరిగింది.అచ్యుతాపురం మండలం పూడిమడకు చెందిన కొర్లయ్య, ఎల్లాజీ, అప్పలరాజు, యర్రయ్యలు సముద్రంలో వేటకు వెళ్లారు. వేట ముగించుకొని బుధవారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా వారికి ఒక భారీ కొమ్ముకోణం చేప కనిపించింది. దాంతో యర్రయ్య గాలం వేశాడు. గాలానికి చిక్కిన చేపలు బోటులోకి లాగుతుండగా చేప బలంగా వెనక్కి లాగటంతో, గాలంతో సహా యర్రయ్య సముద్రంలో పడిపోయాడు. ఆ గాలం అతడి చేతికి చుట్టుకుందేమో గానీ, ఆ చేపతో బాటూ అతడూ సముద్రంలో గల్లంతయ్యాడు. అతడి కోసం ఆ ప్రాంతమంతా గాలించిన తోటి మత్స్యకారులు అతడి ఆచూకీ దొరక్కపోవటంతో నిరాశతో వెనుదిరిగారు. కాగా, ఈ ఘటనతో యర్రయ్య కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. యర్రయ్య కోసం సముద్రంలో వెతికినా ఫలితం లేకపోయిందని, గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని మత్స్యకారులు కన్నీరు పెట్టుకున్నారు.
మరిన్నీ వీడియోల కోసం :