Viral Video: వంతెన కూలి ఎగిరిపడ్డ వాహనాలు.. బొమ్మలాగా ఊగిపోయిన పట్టాలమీద రైలు వైరల్ వీడియో

Updated on: Sep 26, 2022 | 10:30 AM

తైవాన్‌ను శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. శనివారం నుంచి సంభవిస్తున్న వరుస భూకంపాల నేపపథ్యంతో అక్కడి యంత్రాంగం అప్రమత్తమైంది. శనివారం సాయంత్రం సంభవించిన భూకంపం


తైవాన్‌ను శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. శనివారం నుంచి సంభవిస్తున్న వరుస భూకంపాల నేపపథ్యంతో అక్కడి యంత్రాంగం అప్రమత్తమైంది. శనివారం సాయంత్రం సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.4గా నమోదైంది. ఆదివారం మరోసారి 6.9 తీవ్రతతో భూమి కంపించింది. శివారు ప్రాంతంలోని వంతెన కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులతోపాటు రెండు, మూడు వాహనాలు కిందపడిపోయినట్లు సమాచారం. మరో చోట భూకంప తీవ్రతకు రైలు బొమ్మలాగా ఊగిపోయిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ఓ మూలన దాక్కున్నారు. ఇక షిసాంగ్‌ పట్టణంలో భూమికి 7 కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రం ఉందని తైవాన్‌ వాతావరణ శాఖ తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Sep 26, 2022 10:30 AM