Viral Video: చితక్కొడదామని వెళ్లాడు..కట్‌ చేస్తే చావు దెబ్బలు తిన్నాడు!

Updated on: Apr 11, 2025 | 4:43 PM

Viral Video: రిక్షాలో కూరగాయాలు తీసుకొని రోడ్డుపై వెళ్తున్న కూరగాయాల వ్యాపారికి , ఓ కారు యజమానికి మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెడింగ్‌గా మారింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్‌లో చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ మారింది. ఒక కూరగాయల వ్యాపారి రిక్షాలో కూరగాయాలు తీసుకొని రోడ్డుపై వెళ్తున్నాడు. అయితే ఆ రోడ్డుపై ఒక కారు ఆగి ఉన్నట్టు పైనున్న వీడిలో మనం చూడవచ్చు. అయితే ఆ రిక్షా కారుకు తగిలిందా లేదా ఇంకేదైనా జరిగిందో కానీ, కారు ఓనర్‌కు, ఆ కూరగాయల వ్యాపారి మధ్య వాగ్వాదం నెలకొంది. వీడియోలో చూస్తున్న విధంగా చూడ్డానికి బలంగా దిట్టంగా ఉన్న కారు యజమానికి కోపంతో ఆ కూరగాయాల వ్యాపారిని కొట్టేందుకు వెళ్తాడు. తీర అక్కడ సీన్‌ రివర్స్‌ అయ్యింది. కారు యజమాని కూరగాయల వ్యాపారిని కొడతాడు అనుకుంటే..ఆతనే ఇతన్ని పొట్టు పొట్టు కొడుతన్నది మనం వీడియో చూడవచ్చ. వీరిద్దరి గొడవతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో స్థానికులు వచ్చి వాళ్లను అడ్డకున్నారు. కారు యజమానికి అక్కడి నుంచి కారు తీసేయాలని హెచ్చరించారు. అక్కడే ఉన్న కొందరూ ఈ తతంగాన్నంత వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇప్పుడు ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 
Published on: Apr 11, 2025 04:07 PM