వీళ్లు మనుషులేనా.. పెళ్లిలోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు కదా!

Updated on: May 13, 2026 | 2:44 PM

సాధారణంగా పెళ్లిళ్లు జరిగే సమయంలో వియ్యాల వారి కయ్యాలు మామూలే. చిన్న, చిన్న లోటుపాట్లు ఉన్నాయని అలకబూనడం.. ఆ తర్వాత బుజ్జగింపులతో వివాదం సద్దుమణుగుతుంది. నల్లిబొక్క, చికెన్ తక్కువేసారనే విషయంలో గొడవలు జరిగిన సందర్భాలను చూశాం.. కానీ మహారాష్ట్రలోని వసాయ్‌లో మాత్రం వెరైటీగా పెళ్లి పూర్తయిన తర్వాత కట్నం విషయంలో గొడవపడ్డారు.

ఆ పెళ్లింట్లో సందడి వాతావరణం కనిపించింది.. బంధువులు, స్నేహితులతో కళకళలాడింది. ఓవైపు వచ్చిన అతిథులు కొత్త దంపతులతో ఫోటోలు దిగుతుంటే.. మరోవైపు విందు భోజనాలు వడ్డిస్తున్నారు. అప్పటి వరకు సందడిగా కనిపించిన చోట ఉన్నట్టుండి చిన్న వివాదం మొదలైంది.. అది చినికి చినికి పెద్ద గొడవకు దారి తీసింది. ఇరువైపు బంధువులు ఘర్షణకు దిగడంతో కొంతమందికి గాయాలు అయ్యాయి. చివరికి పెళ్లింట్లో గొడవకు కారణం ఏంటో తెలిసి పెళ్లికి వచ్చినవారు, ఆ ఊరి జనాలతో పాటుగా అందరూ అవాక్కయ్యారు. మహారాష్ట్రలోని వసాయ్‌లో వివాహ వేడుక తీవ్ర ఘర్షణకు దారితీసింది. పెళ్లి ముగిసిన కొద్దిసేపటికే వధూవరుల కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో వివాదం పెద్దదైంది. ఈ ఘటనలో ఇరువర్గాలు పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం, చివరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వసాయ్‌లోని ఓ ఫంక్షన్ హాలులో ఆదివారం ఈ వివాహ వేడుక జరిగింది. పెళ్లి ముగిసిన అనంతరం ఇరు కుటుంబాల మధ్య మొదలైన చిన్నపాటి వాగ్వివాదం పెరిగి పెద్దదైంది. అది కాస్తా ముదిరి ఒకరినొకరు తోసుకోవడం, ప్లాస్టిక్ కుర్చీలు విసురుకోవడం వరకు వెళ్లింది. గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు ఈ దాడిలో గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కట్నం విషయంలోనే ఈ వివాదం మొదలైనట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం :

సేఫ్ గేమ్ ఆడుతున్న అమీర్ ఖాన్

మరో సీజన్ ప్లాన్ చేస్తోన్న..మనీ హెయిస్ట్

షూటింగ్ అప్డేట్స్.. ఏ హీరో ఎక్కడ ఉన్నాడంటే?

ఏంటీ ? వీళ్ల మధ్య ఉన్నది భార్య భర్తల బంధం కాదా?

Follow Us