Vande Bharat: ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..

Updated on: Jan 21, 2026 | 5:30 PM

వందే భారత్ స్లీపర్ రైలులో చెత్తాచెదారంపై ఓ ప్రయాణికుడి వీడియో వైరల్ అయ్యింది. కొత్త సదుపాయాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలనే కనీస పౌర స్పృహ కొందరిలో కొరవడిందని ఈ సంఘటన నిరూపిస్తోంది. కోట్లు ఖర్చు పెట్టినా, వ్యక్తిగత బాధ్యత లేకపోతే ప్రభుత్వ ప్రయత్నాలు వృథానే. ప్రజా ఆస్తులను సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను ఈ వీడియో గుర్తుచేస్తుంది.

స్వచ్ఛభారత్‌ ఎలా ఉన్నా.. చాలామందికి కనీసం తమ చుట్టూ ఉన్న పరిసరాలనైనా శుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన లేకపోవడం బాధాకరం. ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి ప్రపంచ స్థాయి సదుపాయాలు కల్పిస్తుంటే వాటిని ఉపయోగించుకోకుండా.. కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. అందుకు ఉదహరణే ఈ వీడియో. ఇటీవలే ప్రధాని మోదీ వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రారంభించారు. ఈ ట్రైన్‌లో తొలిరోజు ప్రయాణించిన ఓ ప్రయాణికుడు విశేషాలు చెబుతూ.. ఓ కంపార్ట్ మెంట్లో తోటి ప్రయాణికులు పడేసిన చెత్తను వీడియోలో చూపిస్తూ ఇది ఎవరి తప్పని ప్రశ్నించాడు. కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రీమియం స్లీపర్ క్లాస్ ట్రైన్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన రైల్వే శాఖదా.. ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించాలని ప్రయత్నించిన ప్రభుత్వానిదా.. అందుబాటులోకి వచ్చిన సదుపాయాన్ని సరిగ్గా వినియోగించుకోలేని మనదా.. ఎవరిది తప్పు? అంటూ నిలదీశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. హౌరా- గువాహటి మధ్య వందేభారత్ తొలి స్లీపర్ ట్రైన్ ను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 17న ప్రారంభించారు. తొలిరోజు అందులో ప్రయాణించిన కొందరు ఐస్ క్రీం తినేసి కప్పులను, వాటర్ బాటిల్, టిష్యూ పేపర్లను సీటు వద్దే పడేశారు. దీంతో కంపార్ట్ మెంట్ చెత్తకుప్పలా మారింది. కొత్త రైలులో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినా వినియోగించుకోవాలనే జ్ఞానం లేకుండా, కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించారు. ప్రతీ కోచ్ లో డస్ట్ బిన్ ఏర్పాటు చేసినా కూడా సీట్లో నుంచి లేచి డస్ట్ బిన్ వద్దకు నడవడానికి బద్దకించారు. సదరు కోచ్ లో ప్రయాణికుల నిర్వాకాన్ని తోటి ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వైరల్ గా మారిన ఈ వీడియో చూసిన నెటిజన్లు మనకు సివిక్ సెన్స్ అస్సలు లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. పబ్లిక్ ప్రాపర్టీని శుభ్రంగా ఉంచుకోవాలనే కనీస స్పృహ లేదని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Tollywood News: టాలీవుడ్ షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడు..?

సంక్రాంతి బ్లాక్‌బస్టర్.. మరి సమ్మర్ సినిమాల పరిస్థితేంటి

Anil Ravipudi: అనిల్ రావిపూడి అంటే పేరు అనుకుంటివా.. హిట్టులకు బ్రాడ్

కొత్త ఏడాది.. కొత్త హీరోయిన్లు.. ఇండస్ట్రీ అంతా కొత్తదనమే

Prabhas: ప్రభాస్ ప్లాన్‌కు మైండ్ బ్లాక్.. ఇలాగైతే రికార్డులు కష్టమే