అయ్యో.. మంటల్లో కాలిపోతూ స్కూటీపై ఆసుపత్రికి వెళ్లిన మహిళ
రోజు రోజుకీ ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. విచక్షణ మరిచి మహిళల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ప్రేమ పేరుతో వేధింపులు, చెయిన్ స్నాచింగ్‌లు, లైంగిక వేధింపులతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో ఆకతాయిలు రెచ్చిపోయారు. స్కూటీపై వెళ్తున్న ఓ వివాహితకు నిప్పు అంటించి పారిపోయారు.
బాధిత మహిళ మంటల్లో కాలిపోతూనే స్వయంగా స్కూటీ నడుపుతూ ఆస్పత్రికి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఆగస్టు 6న లఖ్‌నవూ దగ్గర ఉన్న ఫరూఖాబాద్‌లో జరిగింది. నిషా సింగ్ ను దీపక్ అనే వ్యక్తి రెండు నెలలుగా వేధింపులకు గురిచేసేవాడు. తనతో మాట్లాడమంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చేవాడు. ఈ క్రమంలో ఇటీవల నిషా తన తండ్రి ఇంటికి వచ్చింది. అక్కడినుంచి డాక్టర్ దగ్గరకు వెళ్లేందుకు ఆమె స్కూటీపై బయలుదేరింది. దీన్ని గమనించిన దీపక్ ఆమె స్కూటీని అడ్డగించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో దీపక్, అతడి స్నేహితులు కలిసి నిషాకు నిప్పంటించారు. దీంతో ఆమె కేకలు వేస్తూనే స్కూటర్ నడుపుతూ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి నుంచి మరో ఆస్పత్రికి తరలిస్తుండగా నిషా ప్రాణాలు కోల్పోయింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు. తన ఒంటికి నిప్పంటించింది దీపక్ అని నిషా తనతో పేర్కొందని బాధితురాలి తండ్రి తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీపక్ వేధిస్తున్న విషయాన్ని నిషా తనతో పలుమార్లు చెప్పిందని ఆమె సోదరి పేర్కొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bigg Boss Telugu 9: మొదలైన ఫస్ట్ వీక్ నామినేషన్స్.. పిచ్చి పిచ్చిగా లొల్లి పెట్టుకున్న బ్యూటీలు
డాక్యుమెంటరీగా.. ప్రొద్దుటూరు దసరా సంబరం
Boney Kapoor: నన్ను రూమ్‌కి కూడా రానిచ్చేది కాదు..
కొడుకు లేడు.. కూతుళ్లు లేరు ఆ లగ్జరీ బంగ్లా నాకెందుకు ?? స్టార్ కపుల్.. షాకింగ్ నిర్ణయం!
‘స్పిరిట్’ పై సందీప్ రెడ్డి అప్ డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు