డెలివరీ బోయ్స్‌గా షాపులోకి ఎంట్రీ.. కట్‌చేస్తే

Updated on: Jul 30, 2025 | 5:17 PM

దొంగలు రూట్ మార్చారు.రోజురోజుకీ మారుతున్న టెక్నాలజీ లాగే దొంగలు కూడా అప్డేట్ అవుతున్నారు.చోరీ చేసే విషయంలో తమ పద్ధతిని మార్చుకొని కొత్త అవతారాలు ఎత్తుతున్నారు.అర్ధరాత్రి ఇళ్ళల్లో చొరబడి రోజులు పోయి పట్టపగలే దోపిడీలకు తెగబడుతున్నారు.సిసి కెమెరాలు సెక్యూరిటీ గార్డులు ఎవరిని లెక్కచేయడం లేదు.వచ్చామా పని పూర్తి చేసుకున్నామా సక్సెస్‌ఫుల్‌గా బయటపడ్డామా అన్నట్లుగా తయారయ్యారు.

తాజాగా ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా వచ్చి ఓ నగల దుకాణాన్ని దోచేశారు.ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గురువారం మధ్యాహ్నం ఓ నగల షాప్‌లో పట్టపగలు చోరీ జరిగింది.ఫుడ్ డెలివరీ చేసే డెలివరీ బాయ్స్ లాగా ఓ సంస్థకు చెందిన యూనిఫామ్ వేసుకొని వచ్చిన ఇద్దరు వ్యక్తులు నగల దుకాణంలోకి ఎంట్రీ ఇచ్చారు.ఐదారు నిమిషాల్లోనే షాప్ మొత్తం ఊడ్చుకెళ్లారు.షాపు యజమాని తెలిపిన వివరాల ప్రకారం గురువారం మధ్యాహ్నం 3:30 సమయంలో ఫుడ్ డెలివరీ సంస్థల డ్రెస్సులు ధరించిన ఇద్దరు యువకులు షాప్‌లోకి చొరబడ్డారు.ముఖం కనిపించకుండా హెల్మెట్లు ధరించారు.లోపలికి వస్తూనే అక్కడున్న సేల్స్‌మ్యాన్‌పై దాడి చేశారు.దుకాణంలో బంగారం వెండి ఆభరణాలను బ్యాగుల్లో వేసుకున్నారు.అక్కడున్న కుర్చీతో అడ్డాలు పగలకొట్టి మరి నగలు ఎత్తుకెళ్లారు.ఆపై బైక్ మీద పరారయ్యారు.వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు దుకాణ యజమాని.అక్కడికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన తీరును పరిశీలించారు.దుకాణంలో 20 కిలోల వెండి ఆభరణాలు 125 గ్రాముల బంగారు నగలను దొంగలు ఎత్తుకెళ్లారని యజమాని పోలీసులకు వివరించారు.కాగా షాప్‌లోని సిసిటివి కెమెరాలలో ఈ దొంగతనం మొత్తం రికార్డు అయింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం :

కేవలం రూ.100కే ఇల్లు.. ఎక్కడో తెలుసా? వీడియో

వరుణ్ బర్త్ డే.. భార్య ఇచ్చిన గిఫ్ట్ చూసి ఒక్కసారిగా షాక్ వీడియో

ర్యాపిడో రైడ్‌లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన యువతి..! డ్రైవర్‌ చేసిన పనితో వీడియో