రూ. 10 కోట్ల విలువైన పిజ్జాలు ఫ్రీగా ఇస్తోన్న డొమినోస్!

Updated on: Jul 05, 2026 | 4:56 PM

ఫిఫా వరల్డ్ కప్ 2026లో అమెరికా విజయం ఫుట్‌బాల్ అభిమానులకు డబుల్ సెలబ్రేషన్‌గా మారింది. స్టార్ ఆటగాడు ఫోలారిన్ బలోగన్‌కు రెడ్ కార్డ్ రావడంతో డొమినోస్ ప్రకటించిన 1 మిలియన్ డాలర్ల ఎమర్జెన్సీ పిజ్జా ఆఫర్ అమల్లోకి వచ్చింది. ఎంపికైన రివార్డ్స్ సభ్యులకు 60 వేలకుపైగా ఉచిత పిజ్జాలు అందించనుండగా, అమెరికా 24 ఏళ్ల తర్వాత నాకౌట్ విజయాన్ని కూడా నమోదు చేసింది.

ఫిఫా వరల్డ్ కప్ 2026 నాకౌట్ మ్యాచ్‌లో అమెరికా జట్టు చారిత్రాత్మక విజయం సాధించడమే కాకుండా, అక్కడి ఫుట్‌బాల్ అభిమానులకు ఒక బంపర్ లాటరీ తగిలింది. ప్రముఖ పిజ్జా దిగ్గజం డొమినోస్, అమెరికా ఫ్యాన్స్ కోసం ఏకంగా 1 మిలియన్ డాలర్లు అంటే..సుమారు రూ. 9.50 కోట్లు విలువైన ‘ఎమర్జెన్సీ పిజ్జాల’ను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. బుధవారం రాత్రి బోస్నియా అండ్ హెర్జెగోవినాతో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో అమెరికా స్టార్ స్ట్రైకర్ ఫోలారిన్ బలోగన్‌కు రెడ్ కార్డ్ చూపడంతో ఈ భారీ ఆఫర్ యాక్టివేట్ అయ్యింది. ఇది డొమినోస్ అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఈ ఏడాది మే నెలలోనే, టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ఒక సరికొత్త ప్రచారాన్ని ప్రకటించింది. వరల్డ్ కప్‌లో అమెరికా జట్టు ఆటగాళ్లలో ఎవరికైనా రెడ్ కార్డ్ ఇస్తే, అభిమానుల నిరాశను తగ్గించేందుకు 1 మిలియన్ డాలర్ల విలువైన పిజ్జాలను ఉచితంగా ఇస్తామని వాగ్దానం చేసింది. ఫుట్‌బాల్‌లో రెడ్ కార్డ్ అనేది తీవ్రమైన శిక్ష అయినప్పటికీ, ఆ చేదు జ్ఞాపకాన్ని అభిమానులకు తీపిగా మార్చేందుకు ఈ ‘ఎమర్జెన్సీ పిజ్జా’ ఆఫర్‌ను తెచ్చింది. ఇందులో భాగంగా లక్కీ డ్రా ద్వారా 60,000 కంటే ఎక్కువ ఉచిత మీడియం సైజ్ పిజ్జాలను అందించనుంది. ఈ మ్యాచ్‌లో మొదటగా బలోగన్ 45వ నిమిషంలో గోల్ కొట్టి అమెరికాను ముందంజలో నిలిపాడు. అయితే 64వ నిమిషంలో ఒక ఫౌల్ కారణంగా అతనికి రెడ్ కార్డ్ రావడంతో అమెరికా 10 మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. అయినప్పటికీ 82వ నిమిషంలో మాలిక్ టిల్‌మాన్ అద్భుతమైన ఫ్రీ-కిక్‌తో మరో గోల్ సాధించి అమెరికాకు 2-0 తేడాతో విజయాన్ని అందించాడు. గత 24 ఏళ్లలో వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లో అమెరికాకు ఇదే తొలి విజయం కావడం విశేషం. దీంతో జట్టు రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. ఈ ఆఫర్ అందరికీ వర్తించదు. జూన్ 10 రాత్రి లోపు డొమినోస్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకుని, ‘డొమినోస్ రివార్డ్స్’ మెంబర్‌షిప్ ఉన్న వారిలో ఎంపిక చేసిన విజేతలకు ఈ ఉచిత పిజ్జా లభిస్తుంది. వీరు ఆగస్టు 2, 2026 లోపు దీనిని క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు మూడు గోల్స్ చేసిన బలోగన్ రెడ్ కార్డ్ కారణంగా బెల్జియంతో జరగబోయే కీలకమైన తదుపరి మ్యాచ్‌కు దూరం కావడం అమెరికాకు పెద్ద మైనస్ అని చెప్పాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

EPFO: ‘ఈపీఎఫ్ 2026’ కొత్త నిబంధనలు ఇవే!

గుడిలో హుండీలనే కాదు.. వీటిని కూడా కొట్టేస్తున్నారు..

రుషికొండ భవనాలు ఏం చేయబోతున్నారో తెలుసా?

బిర్యానీ ఫ్రీ అన్నారు.. తీరా అక్కడికి వెళ్లాక..

ద్రవ్యోల్బణం కంటే ‘ఏఐ’తోనే పెను ముప్పు ఆర్‌బీఐ సంచలన నివేదిక!

Follow Us