బీహారీ వంటకాన్ని అదరగొట్టిన అమెరికన్ చెఫ్ !! ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
ఇండియన్ ఫుడ్ అంటే విదేశీయులు కూడా ఆసక్తిగా తింటారు. అందుకే విదేశీ చెఫ్‌లు కూడా ఇండియన్ వంటకాలను నేర్చుకుంటున్నారు. తాజాగా అమెరికన్ చెఫ్, వ్లోగర్ ఇటన్ బెర్నత్ బీహారీ ఫేమస్ వంటకం లిట్టి చొక తయారీని నేర్చుకున్నారు.
ఇండియన్ ఫుడ్ అంటే విదేశీయులు కూడా ఆసక్తిగా తింటారు. అందుకే విదేశీ చెఫ్‌లు కూడా ఇండియన్ వంటకాలను నేర్చుకుంటున్నారు. తాజాగా అమెరికన్ చెఫ్, వ్లోగర్ ఇటన్ బెర్నత్ బీహారీ ఫేమస్ వంటకం లిట్టి చొక తయారీని నేర్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో బీహారీ మహిళలు బెర్నత్‌ను నుదుట తిలకం దిద్ది, పూల అక్షింతలు చల్లి సాదరంగా ఆహ్వానించారు. కిచెన్‌లోకి తీసుకెళ్లి ఎంతో వివరంగా లిట్టి చొక తయారు చేసే విధానాన్ని వివరించారు. స్వయంగా బెర్నత్‌తో చేయించారు. అనంతరం ఆయన ఆ స్నాక్ ఐటమ్‌ను టేస్ట్ చేసారు కూడా. ఈ వీడియోను నెట్టింట పోస్ట్ చేస్తూ..పాట్నాలో ఈరోజు తనకు దీదీ కి రసోయిలో లిట్టి చొక తినే అవకాశం లభించిందని ఇటన్ పేర్కొన్నారు. దీదీలు తమ కిచెన్‌లోకి స్వాగతించి సంప్రదాయ బిహారీ రుచుల గురించి వివరంగా చెప్పుకొచ్చారని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటికే 30,000 మందికి పైగా వీక్షించారు. అంతేకాదు పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు కూడా.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ గోస ఎవలకు రావద్దు రో.. అయ్యో.. స్కూల్ కి వెళ్ళడానికి బుడ్డోడి అవస్థ చూస్తే పొట్ట చెక్కలే
ఈ మాల్‌లో అన్నీ ఫ్రీ !! దుస్తులు, వస్తువులు ఎంచక్కా తీసుకెళ్లొచ్చు !!
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్‌పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు

